ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University)లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను నిషేధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) యంత్రాంగం విధించిన ఆంక్షలపై అమెరికా కోర్టు(America Court)స్టే(Stay)ను పొడిగించింది. కీలక ఆదేశాలను జారీ చేసిన డిస్ట్రిక్ట్ జడ్జి(District Judge) అలిసన్ బరోజ్.(Alison Bajaj). ట్రంప్ దూకుడుకు బ్రేక్‌లు వేశారు. గత వారం అమెరికా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై జడ్జి అలిసన్ స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) కార్యదర్శి క్రిస్టీ నోమ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖ రాసి.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మారాలని లేదంటే విదేశీ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ చర్యలపై హార్వర్డ్ న్యాయపోరాటానికి దిగింది.

ఇందులో భాగంగా, హార్వర్డ్‌కు గురువారం మరో లేఖ రాసిన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ టాడ్ లయన్స్… చైనా కమ్యూనిస్టు పార్టీతో అనుబంధం, క్యాంపస్‌లో యూదులపై విద్వేష ప్రచారానికి అనుకూల వాతావరణం కల్పించడం వంటి ఆరోపణలతో హార్వర్డ్‌కి విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని రద్దు చేసే ప్రతిపాదనపై 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ ఫెడరల్ నిధులు నిలిపివేసిన విషయం తెలిసిందే.
న్యాయసూత్రాలకు విరుద్ధం
అయితే, హోంల్యాండ్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు ఇవ్వకుండా నేరుగా చర్యలు చేపట్టిందని. ఇది న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ న్యాయస్థానంలో హార్వర్డ్ యూనివర్సిటీ దావా వేసింది. హార్వర్డ్ వలస సేవల విభాగం డైరెక్టర్ మౌరీన్ మార్టిన్ కోర్టులో మాట్లాడుతూ.. ట్రంప్ యంత్రాంగం విద్యార్థుల ప్రవేశంపై తీసుకున్న చర్యలు ‘భయాన్ని, ఆందోళనను, అయోమయాన్ని’ కలిగించాయని తెలిపారు. విదేశీ విద్యార్థుల గైర్హాజరీ వల్ల తమ విద్య అనుభవం దెబ్బతింటుందని భావించిన అమెరికన్ స్టూడెంట్లు వేరే విశ్వవిద్యాలయాలకు బదిలీ లేదా ప్రవేశాన్ని వాయిదా వేయాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. అలాగే అనేక మంది అంతర్జాతీయ విద్యార్థులు బదిలీ అవకాశాల గురించి తెలుసుకుంటున్నారని వెల్లడించారు.
Read Also: Trump: పాకిస్తాన్ తో కాల్పుల విరమణ పై ట్రంప్ వాదనను ఖండించిన భారత్