హైదరాబాద్: ఈరోజు నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 78 ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు ఈ మొత్తం ఫిర్యాదులను మీషనర్ రంగనాథ్ స్వయంగా స్వీకరించారు. చెరువులు, నాళాల, రహదారులు, పార్కుల కబ్జాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ ఫిర్యాదులను విచారించి.. సంబంధిత అధికారులకు ఆయా ఫిర్యాదులను కేటాయించి విచారణ చేపట్టాలని కమిషనర్ ఆదేశం ఇచ్చారు.
ఒకవేళ నాలుగు వారాల్లో ఫిర్యాదు పరిష్కారం కాకుంటే.. తానే స్వయంగా వచ్చి విచారిస్తానని ఫిర్యాదుదారులకు కమీషనర్ చెప్పారు. అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామం సర్వే నంబరు 119 నుంచి 220 వరకూ ఉన్న 408 ఎకరాల్లో అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని ఫిర్యాదు వచ్చింది. అలాగే అబ్దుల్లాపూర్ మండలం కుంట్లూర్ చెరువులో 2 ఎకరాల స్థలాన్ని కబ్జాచేశారని.. వెంటనే ఆ భూమిని కాపాడాలంటూ.. ఇంకా నిజాంపేట మున్సిపాలిటీ లో 2900 గజాల పార్కును స్థానికులు కబ్జా చేస్తున్నారని కేవీఆర్ రెయిన్‌బో కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేసారు.
![image](https://vaartha.com/wp-content/uploads/2025/01/image-212.png.webp)
కాగా, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామం సర్వే నంబరు 119 నుంచి 220 వరకూ ఉన్న 408 ఎకరాల్లో అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. గతంలో 3800 మంది అక్కడ గ్రామపంచాయతీ లే ఔట్‌లో ఇంటి స్థలాలు కొని రిజిస్టర్ చేసుకుంటే.. ఆ భూమి ప్రభుత్వానిది అని తేల్చితే.. తామంతా కోర్టును ఆశ్రయించామని హైడ్రా కమిషనర్‌కు వివరించారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ అక్కడ వారు అన్ని వ్యవస్థలను మేనేజ్‌చేసి ఇంటి స్థలాలుగా అమ్మేస్తున్నారని పేర్కొన్నారు. ఇలా 700ల పైచిలుకు ఇళ్లు నిర్మాణం జరిగాయని.. ప్రభుత్వ శాఖలు కూడా కరెంటు,తాగు నీరు, రహదారుల సౌకర్యం కల్పిస్తున్నాయని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. హైడ్రా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గతంలో అక్కడ ఇంటి స్థలాలు కొన్నవారు అభ్యర్థించారు.