ఖమ్మం జిల్లాకు కలెక్టర్‌గా సేవలందించిన ముజమ్మిల్ ఖాన్ (Muzammil Khan ) బదిలీపై వెళ్లుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు ఆయనను ఎమోషనల్‌గా వీడ్కోలు చేశారు. ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల మధ్య వినయంగా, బాధ్యతతో పనిచేసిన ముజమ్మిల్ ఖాన్ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రజల కోసం అందుబాటులో ఉండటం, అధికార యంత్రాంగాన్ని సమర్థంగా నడిపించడం ద్వారా ఆయన ప్రజా మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
వీడ్కోలు వేడుకలో భావోద్వేగం
అధికారిక వీడ్కోలు సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముజమ్మిల్ ఖాన్‌పై రూపొందించిన ప్రత్యేక వీడియో (ఏవీ)ను చూపించగా, ఆయన భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు లభించిన ఆదరణ, సహకారం తన జీవితంలో మరిచిపోలేనిదని అన్నారు. ఖమ్మం వాసులు తనకు చూపిన ప్రేమ ఎప్పటికీ గుర్తుగా నిలిచిపోతుందన్నారు.
జనాల్లో భావోద్వేగ స్పందన – ‘Miss You Sir’
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌కి వీడ్కోలు చెప్పిన తరవాత సోషల్ మీడియాలో ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. “MISS YOU SIR”, “Best Collector Ever”, “A People’s Officer” అనే హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్ట్‌లు పెడుతున్నారు. ఖమ్మంలో కలెక్టర్‌గా పనిచేసిన ఆయన సేవలను ఎన్నటికీ మర్చిపోలేమంటూ నెటిజన్లు పోస్టులు వేస్తున్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్రను ఎంతో మందీ ప్రశంసిస్తున్నారు.
Read Also : Honeytrap :హనీ ట్రాప్ లో చిక్కిన 70 ఏళ్ల వృద్ధుడు రూ. 38.73 లక్షలు కోల్పోయాడు