revanth reddy

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన సీఎం రేవంత్ ఫోకస్ చేసారు. ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్ ల పదవీ కాలం ముగిసిన ఏడాది పూర్తవుతుంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో, ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారుతోంది. దీంతో, ఈ రోజు ఎన్నికల పైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రేవంత్ సమావేశం తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం మొదలవుతోంది. అయితే, ముహూర్తం పైన ఈ రోజు స్పష్ట త వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులు, అధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దీంతో, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇప్పటికే కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. ఈ రోజు సమావేశంలో ఈ నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం కనిపిస్తోంది. మంత్రులు, అధికారులతో చర్చించిన తరువాత రిజర్వేషన్ల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తరువాతనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం.

Advertisements

మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమై ఏప్రిలో 4 వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఇంటర్‌, డిగ్రీ పరీక్షలు, మే నెలలో వివిధ ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. ఆ తరువాత వేసవిలో వచ్చే సహజమైన సమస్యలు ఎన్నికల నిర్వహణ.. ఫలితాల పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. నీటి ఎద్దడి, విద్యుత్ కోతలు వంటివి ప్రతిపక్షాలకు అవకాశం మారే ఛాన్స్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.ఎన్నికల సమరం దీంతో, ఫిబ్రవరిలోనే ఎన్నికలకు వెళ్తారా.. లేక జూన్ తరువాత నిర్వహిస్తారా అనేది ఈ భేటీలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

Related Posts
పద్ధతి మార్చుకోవాలంటూ రేవంత్‌రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్
kishan reddy warning

మూసీ పరివాహక ప్రాంతాల్లో “బీజేపీ మూసీ నిద్ర” కార్యక్రమం చేపట్టింది. మూసి సుందరీకరణ పేరుతో మూసి వాసుల ఇళ్లను కూల్చడం..అక్కడి ప్రజలను మరోచోటుకు తరలించడం పట్ల బిఆర్ఎస్ Read more

రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం
రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ Read more

గ్రామస్థాయి ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
cm revanth ryathu sabha

తెలంగాణలో గ్రామస్థాయి ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. జీతాలు క్రమం తప్పకుండా చెల్లించేందుకు అధికారులను ఆయన ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు Read more

Bharat Summit : ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత్ సమ్మిట్ ఓ మైలురాయి – మంత్రి పొన్నం
Bharat Summit at hyd

తెలంగాణలో జరుగుతున్న భారత్ సమ్మిట్ దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా కీలక సందేశాన్ని పంపుతోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, శాంతి Read more

Advertisements
×