kishan reddy warning

పద్ధతి మార్చుకోవాలంటూ రేవంత్‌రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్

మూసీ పరివాహక ప్రాంతాల్లో “బీజేపీ మూసీ నిద్ర” కార్యక్రమం చేపట్టింది. మూసి సుందరీకరణ పేరుతో మూసి వాసుల ఇళ్లను కూల్చడం..అక్కడి ప్రజలను మరోచోటుకు తరలించడం పట్ల బిఆర్ఎస్ తో పాటు బిజెపి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న వారిని సడెన్ గా ఇక్కడి నుండి వేరే చోటికి వెళ్ళమని చెప్పడం..ఇల్లు కూల్చేస్తాం అంటే ఎలా అని వారంతా ప్రశ్నించారు. అయితే సియోల్‌ తరహాలో హైదరాబాద్‌లో మూసీని పునరుజ్జీవింపజేస్తామంటూ తెలంగాణ లోని రేవంత్ సర్కార్ చెబుతోంది. మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే బుల్జోజర్లతో తొక్కిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

రేవంత్‌ కామెంట్స్‌కు బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చూస్తున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అసలు ఎలా ఉండబోతోంది? అనేది ఇప్పటి వరకు ప్రజలకు, అధికారులకు ఎవరికీ తెలియదని, కానీ సర్కార్ మాత్రం అడ్డుగోలుగా నిరుపేదల ఇండ్లను కూల్చుతోందని ఘాటు విమర్శలు చేశారు. మూసీ సుందరీకరణకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని రెడ్డి ప్రశ్నించారు.

మూసీపై తాము నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఇప్పటికే బాధితులతో తాము ధర్నా నిర్వహించినట్లు గుర్తుచేశారు. సీఎం ప్రకటనలతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడు బుల్డోజర్ తో ఇల్లు కూలుస్తారో అనే భయంలో ప్రజలు ఉన్నారన్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే బస్తీ నిద్ర చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్ర చేస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పేదల ఇండ్లు కూల్చాలన్నది ఏమాత్రం న్యాయం కాదని, రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

Related Posts
మూసీ పనులకు.. టెండర్లకు ఆహ్వానం పలికిన ప్రభుత్వం
musi

మూసీ పునరుజ్జీనం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపట్టింది, ఇది ముఖ్యంగా దక్షిణ కొరియాలోని నదుల సుందరీకరణ మరియు మురునీటి శుద్ధి కార్యక్రమాలను పరిశీలించడానికి మంత్రులు, అధికారుల Read more

అమ్మ ఆత్మహత్యాయత్నం చేయలేదు- కల్పన కుమార్తె
singer kalpana daughter

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేశారనే వార్తలు నిన్న నుండి ప్రచారం అవుతున్నాయి. అయితే, ఈ వార్తలపై ఆమె కుమార్తె దయ ప్రసాద్ స్పందిస్తూ, అవి పూర్తిగా Read more

జనవరిలో 100వ మిషన్‌ ప్రయోగం: ఇస్రో చీఫ్‌
100th mission launch in January.. ISRO chief

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 2025లో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) ఎన్‌వీఎస్-02 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్‌ కోసం సన్నాహాలు Read more

గవర్నర్, కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం
Fire Accident HSAGAR

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్లో జరిగిన 'భారతమాతకు మహా హారతి' కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కార్యక్రమం Read more