రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం

రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్ధమవుతుండగా, సీఎం రేవంత్ కీలక వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేవంత్ కొత్త ప్రణాళిక రూపొందించారని తెలుస్తోంది.ఈ నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అంతకు ముందే ప్రత్యేక అసెంబ్లీ భేటీకి రేవంత్ నిర్ణయించారు. మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిన ట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల్లో వీటి పైన చర్చ నిర్వహించి బిల్లులకు చట్టబద్ధత కల్పించ ను న్నారు. కాగా, మార్చి 10 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఢిల్లీ కి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ బీసీ రిజర్వేషన్లకు మద్దతివ్వాలని కేంద్రాన్ని కోరనున్నారు.

Advertisements

రిజర్వేషన్లపై బిల్లులు:

ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు,విద్య, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రిజర్వేషన్ల విషయం లో కేంద్రంతో పోరాటం చేయటానికి వెనుకడేది లేదని సమాచారం.

CM Revanth condemns attacks on houses of film personalities

రిజర్వేషన్లుపెంపు

బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చేసే చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదిస్తే సరిపోదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పెంచిన రిజర్వేషన్లు అమలు కావాలంటే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. లేదా పార్లమెంటులో ఈ చట్టాన్ని ఆమోదింపజేసి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి.ఈ చట్టానికి కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాటం చేయాలని రేవంత్‌ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50శాతం సీలింగ్ పరిధిలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ పోగా మిగిలినవి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. జనాభా ప్రకారం ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని పేర్కొన్నట్లు సమాచారం. రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన ఇతర అంశాలు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగాన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు.వచ్చే రెండు నెలల పాటు పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపేలా సన్నాహక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూలు ప్రకటించారు.

కెసిఆర్ కీలక ప్రకటన చేసారు వచ్చే రెండు నెలల పాటు పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపేలా సన్నాహక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూలు ప్రకటించారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని కేడర్‌కి సూచించారు.

Related Posts
వరంగల్ లో ఎయిర్ పోర్ట్ కు కేంద్రం అనుమతి
దశాబ్దాల కల సాకారం: మామునూరు విమానాశ్రయానికి కేంద్ర అనుమతి!

తెలంగాణలోని మామునూరు (వరంగల్) ఎయిర్ పోర్ట్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు తాజాగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం Read more

KCR:టీడీపీ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన కెసిఆర్
KCR:టీడీపీ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన కెసిఆర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని మార్చుకుని మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. గత పదేళ్లపాటు తెలంగాణను పాలించిన Read more

6 జిల్లాల్లో వెదురు సాగుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
veduru

తెలంగాణ రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నాలుగేళ్లలో 7 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ Read more

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు
జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పై ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు తీవ్ర అనుచిత వ్యాఖ్యల Read more

×