హైదరాబాద్‌లో కుండపోత వర్షం (Rain) కారణంగా నగరం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదని, ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖ, ట్రాఫిక్ పోలీస్ విభాగాలు సమష్టిగా స్పందించాలన్నారు.
ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల రంగప్రవేశం
వర్షం ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో SDRF, NDRF బృందాలు, హైడ్రా (Hydraa) మిషన్ల బృందాలు వెంటనే చొరవ చూపాలని సీఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్థానిక అధికారులు, రెవెన్యూ సిబ్బంది ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే సహాయం అందించాలన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు హాని కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు.
పెరిగిన ఫిర్యాదులకు తక్షణ స్పందన అవసరం
వర్షం, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల ఫిర్యాదులను అధికారులు గమనించి వెంటనే స్పందించాలని సీఎం ఆదేశించారు. ప్రజల పట్ల నిఖార్సైన విధంగా వ్యవహరించాలి, ఒక్క ఫిర్యాదును కూడా నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నా వెంటనే రెస్పాన్స్ టీమ్ అక్కడకు చేరుకోవాలన్నారు. ప్రజలకు భరోసా కలిగించేలా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు.
Read Also : BRS : 100 సీట్లతో అధికారంలోకి వస్తాం – కేటీఆర్