CM Chandrababu gets relief in Supreme Court

సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట..

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేసి విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టు లాయర్ బి. బాలయ్య దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది విచారణ చేపట్టారు. సీబీఐకి కేసుల బదలాయింపు పిటిషన్ ను డిస్మిస్ చేశారు. ఇది సరైన పిటిషన్ కాదని, దీనిపై ఒక్క మాట ఏమైనా మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది సూచించారు.

image

బాలయ్య తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాది మణీందర్‌ సింగ్‌ సుప్రీంకోర్టు బెంచ్ ఎదుటకు వచ్చారు. ఆయనకు సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఇలాంటి పిటిషన్లను కూడా మీలాంటి సీనియర్లు వాదిస్తారా? ఈవిధమైన కేసులను వాదిస్తారని మేం అస్సలు ఊహించలేదు అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా న్యాయవాది వైపు నుంచి వినకుండానే ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

Related Posts
Telangana : పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు పై కొనసాగుతున్న ప్రజాగ్రహం
Telangana : పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు పై కొనసాగుతున్న ప్రజాగ్రహం

హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీకి ఉన్న పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు, Read more

Nara Lokesh: అమరావతిలో బ్రిక్స్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: నారా లోకేష్
Nara Lokesh: అమరావతిలో బ్రిక్స్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్, విదేశీ విశ్వవిద్యాలయాలకు ప్రోత్సాహం! అమరావతిలో బిట్స్, డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటువిశాఖలో ఏఐ వర్సిటీ, అమరావతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీవిద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న మంత్రి Read more

నేటి నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Inter exams start from today

నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ..! అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 34 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి Read more

కొత్త కారు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్..ధర తెలిస్తే షాకే
mla mynampally rohit

రోహిత్ కొత్త కారును కొనుగోలు చేసిన వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ తెలంగాణలో అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రూ.3 కోట్ల విలువైన Read more