ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల స్టాల్స్ ను సందర్శించిన అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి, మహిళల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను సమీక్షించారు. ముఖ్యంగా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి, వారికి ప్రోత్సాహం అందించారు.
డ్వాక్రా మహిళల స్టాళ్లను సందర్శించిన సీఎం
మార్కాపురంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళల స్టాళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు గణనీయమైన ఆసక్తి కనబరిచారు. వారు తయారు చేసిన వస్తువులను పరిశీలిస్తూ, వాటి తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులకు మరింత మార్కెట్ అందుబాటులోకి రావాలని సూచించారు.
భువనేశ్వరి కోసం పట్టుచీర కొనుగోలు
ఓ చీరల స్టాల్‌ను సందర్శించిన చంద్రబాబు అక్కడి మహిళలతో సంభాషించారు. “ఈ చీర ఎంతకు అమ్ముతున్నావమ్మా?” అని అడగగా, స్టాల్‌లో ఉన్న మహిళ “రూ.26,400” అని చెప్పింది. అయితే, సీఎం చంద్రబాబు బేరం ఆడి ఆ చీరను రూ.25 వేలకు కొనుగోలు చేశారు. ఈ చీరను తన సతీమణి నారా భువనేశ్వరి కోసం తీసుకున్నట్లు తెలిపారు.
మంగళగిరి పట్టుచీరలపై ఆసక్తి
చంద్రబాబు స్టాళ్లలో మంగళగిరి పట్టుచీరలు కూడా ఉండటాన్ని ఆసక్తిగా పరిశీలించారు. స్టాల్స్‌లో షర్ట్, పంచె, కండువా సెట్లను కూడా చూసి, వ్యాపారం ఎలా సాగుతోందని అక్కడి మహిళలను అడిగి తెలుసుకున్నారు.
పర్యావరణ రహిత సంచులపై అభినందన
ఈ సందర్భంగా, పర్యావరణ హితమైన గుడ్డ సంచులు వాడుతున్న డ్వాక్రా మహిళలను చంద్రబాబు అభినందించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఇలా గుడ్డ సంచులను వాడటం మంచిదని అభినందించారు.ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహం కల్పిస్తూ, స్వయం ఉపాధికి మరింత తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల స్టాల్స్ ను సందర్శించిన అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి ఆఖరు రోజవుతుందని హెచ్చరించారు. ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు సంపాదించకపోతే పురుషులు చులకనగా చూస్తారని అన్నారు. ఈ ఏడాదిలో లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారుచేస్తామని చెప్పారు. ఆడబిడ్డలు సంపాదించేందుకే డ్వాక్రా ప్లాట్ ఫామ్ సృష్టించామని వెల్లడించారు. తాను రాజకీయాల్లో ఉండడం వల్ల డబ్బు సంపాదించలేకపోయానని,తన అర్ధాంగి భువనేశ్వరి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారని తెలిపారు. ఇంట్లో నాకు కూడా డబ్బులిచ్చే స్థాయికి భువనేశ్వరి ఎదిగారు అని చంద్రబాబు గర్వంగా చెప్పారు.