हिन्दी | Epaper

CM Revanth : చర్చకు రమ్మంటే సీఎం తోకముడిచి పారిపోయాడు – కవిత

Sudheer
CM Revanth : చర్చకు రమ్మంటే సీఎం తోకముడిచి పారిపోయాడు – కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కొత్తగూడెంలో జరిగిన జాగృతి జిల్లా విస్తృత సమావేశంలో మాట్లాడిన ఆమె, సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ఆరోపించారు. అసలు సమస్యలపై దృష్టి మళ్లించేందుకు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

చర్చకు సిద్ధమన్న కవిత

“కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రంకెలు వేస్తున్నారు. కానీ మేము చర్చకు సిద్ధమన్న తర్వాత ఆయన తోక ముడిచారు. మీరు సమర్థులైతే ICCC కార్యాలయానికి రావచ్చు. మహిళలంతా కలిసి వస్తాం. మీ హామీలపై ముఖాముఖీ చర్చిద్దాం” అని కవిత సవాల్ విసిరారు.

మహిళల హక్కులపై ప్రశ్నలు

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2,500 భృతి, తులం బంగారం, పెన్షన్ పెంపు వంటి అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కవిత విమర్శించారు. ఈ హామీల అమలుపై సరైన సమాధానం ఇవ్వాలని, లేకపోతే ప్రజలే సమాధానం చెబుతారన్న హెచ్చరిక కూడా చేశారు.

Read Also : Local Elections : ఆగస్టు చివరికల్లా తెలంగాణాలో ఎన్నికల ప్రక్రియ పూర్తి!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870