అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచిన ‘ధురంధర్’ (Durandhar Movie) నిలిచింది.ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ పవర్‌ఫుల్ పాత్రలో నటించి మరోసారి తన స్టార్‌డమ్‌ను నిరూపించుకోగా, సారా అర్జున్ హీరోయిన్‌గా ఆకట్టుకుంది. అలాగే అక్షయ్ ఖన్నా చేసిన స్పెషల్ రోల్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా, మంచి కలెక్షన్ లు రాబట్టింది.ప్రతి పాత్రకి ఒక ప్రయోజనం ఉండటంతో అసలైన విజయంతో ఈ సినిమా దూసుకుపోయింది. 1300 కోట్ల మార్క్ ను టచ్ చేసింది.
Read Also: Shambhala Movie: OTTలో కి వచ్చేసిన ‘శంబాల’
ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్
ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానున్నట్లు అధికారికంగా వెల్లడైంది.థియేటర్ కలెక్షన్లతోనే కాదు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా (Durandhar Movie) కు సీక్వెల్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే.

దురంధర్ సీక్వెల్‌ను మార్చి 19న విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.మొదటి భాగం సాధించిన ఘనవిజయంతో సీక్వెల్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మొత్తంగా దురంధర్ థియేటర్లలో సంచలనం సృష్టించినట్లే, ఇప్పుడు ఓటీటీలోనూ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: