బాలీవుడ్ నుండి వచ్చిన క్రేజీ సీక్వెల్ “ధడక్ 2” (Dhadak 2) ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి (Siddhant Chaturvedi, Tripti Dimri) ప్రధాన పాత్రల్లో నటించి, కొత్త యంగ్ జెనరేషన్ ప్రేమ కథను తెరపై చూపించారు. దర్శకురాలిగా షాజియా ఇక్బాల్ పనిచేసి, ఈ కథను క్రమంగా, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో అందించారు. జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, క్లౌడ్ 9 పిక్చర్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా, ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Shraddha Srinath: ది గేమ్.. యూ నెవర్ ప్లే అలోన్ ట్రైలర్ విడుదల
ఆగష్టు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఈ సినిమా సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. తమిళ చిత్రం ‘పరియేరుమ్ పెరుమాళ్’ (‘Pariyerum Perumal’) కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.
కథేంటంటే
ఈ చిత్రం నిలేష్ (సిద్ధాంత్ చతుర్వేది) విధి (త్రిప్తి డిమ్రీ) అనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. నిలేష్ అనే అణగారిన కులానికి చెందిన యువకుడు లా చదువుదామని న్యాయ కళాశాలలో జాయిన్ అవ్వగా.. అతడికి విధి అనే ఉన్నత కులానికి చెందిన యువతి పరిచయమవుతుంది. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారాగా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఈ సినిమా కథ.
Read hindi news: hindi.vaartha.com
Read Also: