ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 థియేటర్లలో విడుదలై 45 రోజులు పూర్తిచేసుకుంటోంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా వసూళ్లలో తన జోరును తగ్గించలేదు. చాలా చోట్ల ఈ సినిమా ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. ఈ కొత్త వెర్షన్‌ను చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు భారీగా క్యూ కడుతున్నారు.గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 భారతీయ సినిమా రికార్డులను మళ్లీ తిరగరాసింది. ఇప్పటికే ఈ సినిమా రూ.
1850 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసింది. తద్వారా బాహుబలి 2 రికార్డును అధిగమించి, అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.పుష్ప 2 థియేటర్లలో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్నప్పటికీ, ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్ పై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. సినిమా మేకర్స్ ఇంతకుముందు ప్రకటించిన ప్రకారం, థియేటర్లలో విడుదలైన 56 రోజులు తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.ఈ నేపథ్యంలో పుష్ప 2 ఓటీటీలో విడుదలకు సమయం ఆసన్నమవుతుందని సమాచారం.
మరోవైపు, రీలోడెడ్ వెర్షన్‌లో కొత్త సీన్లు ప్రేక్షకులకి మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.అల్లు అర్జున్ తన శైలితో పుష్ప 2 లో మరోసారి అద్భుతంగా ఆకట్టుకున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ బ్లాక్ బస్టర్ సినిమా అన్ని భాషల్లో విజయం సాధించి, ఇండియన్ సినిమా గౌరవాన్ని మరింత పెంచింది.ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 ఓటీటీలోకి ఎంటర్ అవుతే, అది మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.