కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’ విడుదలపై సందిగ్దత నెలకొంది.. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ముందుగా ప్రణాళిక వేసుకుంది. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా లభించకపోవడంతో సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది.
అధికారిక ప్రకటన
మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. కొన్ని అనివార్య కారణాలతో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని పేర్కొంది.”మా శ్రేయోభిలాషులకు, ప్రేక్షకులకు ఈ వార్తను తెలియజేయడానికి మేము చాలా విచారిస్తున్నాము. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జన నాయకన్’ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది.
అయితే మా నియంత్రణలో లేని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాపై మీకున్న అంచనాలు, ఉత్సాహం, భావోద్వేగాలను మేము పూర్తిగా అర్థం చేసుకోగలము. ఈ నిర్ణయం తీసుకోవడం మాకు కూడా చాలా కష్టమైన విషయమే. కొత్త విడుదల తేదీని వీలైనంత త్వరలో ప్రకటిస్తాము. అప్పటి వరకు, ప్రేక్షకులు, అభిమానులు ఓపికతో ఉండి మాపై మీ ప్రేమాభిమానాలను ఇలాగే కొనసాగించాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. మీ అచంచలమైన మద్దతే మా ‘జన నాయకన్’ టీమ్‌కు అతిపెద్ద బలం. అది మాకు ఎంతో విలువైనది” అని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటనలో పేర్కొంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: