Vijay Sethupathi: తమ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి గొప్పలు చెప్పుకునే వారే తప్ప, వైఫల్యాలను ఒప్పుకునే ధైర్యం చేసేవారు చాలా అరుదు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ విషయంలో అందరికంటే భిన్నంగా నిలిచారు. తాను నిర్మాతగా మారి తీసిన సినిమాలన్నీ నష్టాలనే మిగిల్చాయని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం లాభాల కోసం కాకుండా, వైవిధ్యమైన కథల మీద ఉన్న మక్కువతోనే తాను సినిమాలు తీశానని ఆయన స్పష్టం చేశారు.

డిజిటల్ రంగంలోకి ‘కాట్టాన్’ వెబ్ సిరీస్ తో
విజయ్ సేతుపతి నిర్మాతగా తన ప్రయాణాన్ని ‘సంగుతేవన్’ అనే చిత్రంతో ప్రారంభించారు. అయితే, అది మధ్యలోనే ఆగిపోవడంతో సుమారు రూ. 1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఆయన తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఆరెంజ్ మిఠాయి, మేర్కు తోడర్చి మలై, జుంగా, లాభమ్ వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, ఆర్థికంగా మాత్రం ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అయినప్పటికీ, మనసుకు నచ్చిన కథలను వెండితెరకు పరిచయం చేశానన్న తృప్తి తనకు ఉందని, ఆ సినిమాల విషయంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
నిర్మాతగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే, విజయ్ సేతుపతి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన నిర్మాణంలో రూపుదిద్దుకున్న ‘కాట్టాన్’ (Kaattan) అనే వెబ్ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. వెండితెరపై ప్రయోగాలు చేసిన ఈ విలక్షణ నటుడు, ఇప్పుడు డిజిటల్ వేదికపై నిర్మాతగా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :