మలయాళం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్ శ్రీనివాసన్ (Srinivasan) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కన్నూరు జిల్లాలోని పట్టియంలో 1956లో జన్మించారు శ్రీనివాసన్ (Srinivasan) . సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి ఆలోచింపజేశారు. శ్రీనివాసన్‌కు భార్య విమల, ఇద్దరు కుమారులు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ ఉన్నారు.
Read Also: White house: ట్రంప్ విందుకు హాజరైన మల్లికా షెరావత్

పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు
వీరిద్దరూ మలయాళ చిత్ర పరిశ్రమలో నటులుగా, దర్శకులుగా రాణిస్తుంన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. శ్రీనివాసన్ సినీ ప్రస్థానం ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగింది. తన కెరీర్ లో ఆయన 225కి పైగా చిత్రాల్లో నటించారు. తనదైన ప్రత్యేక నటన, సామాజిక అంశాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించే హాస్యంతో మలయాళ సినిమాపై చెరగని ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగానూ ఆయన పరిశ్రమకు ఎనలేని సేవ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: