కీర్తి సురేష్ మరోసారి ఓటీటీ వేదికపై తన నటనా ప్రతిభను చాటేందుకు “ఉప్పు కప్పురంబు” అనే విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం జూలై 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. దర్శకుడు ఐవీ శశి (Iv Shashi) తెరకెక్కించిన ఈ సినిమాలో యువ నటుడు సుహాస్ ముఖ్యపాత్రలో నటించగా, కథలో సున్నితమైన భావోద్వేగాలు, సామాజిక సందేశం కలిసి కనిపిస్తాయి.అయితే ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూ లో తెలుసుకుందాం.
కథ విషయానికి వస్తే
ఈ సినిమా కథ మొత్తం చిట్టి జయపురం అనే ఊరి చుట్టూ తిరుగుతుంది. తన తండ్రి మరణంతో చిట్టి జయపురం ఊరి పెద్దగా బాధ్యతలు తీసుకుంటుంది అపూర్వ (కీర్తి సురేశ్). అయితే అపూర్వకి ఇది సంతోషం ఇచ్చేలోపే ఊరికి విచిత్రమైన సమస్య వస్తుంది. ఊరిలో శ్మశానం కొరత ఎదురవుతుంది. ఆ ఊరిలో మొదటగా చనిపోయిన నలుగురికి మాత్రమే శ్మశానంలో చోటు ఉంటుంది. దీంతో ఈ విషయాన్ని ఊరి పెద్ద అయిన అపూర్వ (Apoorva) ముందుకు తీసుకువెళతాడు కాటికాపరి చిన్న (సుహస్). ఈ విషయం తెలిసిన అపూర్వ ఊరి కోసం ఏం చేసింది. అపూర్వకి కాటికాపరి చిన్న ఎలా సహాయపడ్డాడు. శ్మశానం సమస్య ళ్లో ఎలాంటి చిచ్చు పెట్టింది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

సామాజిక సమస్యను వినోదంతో
యువ దర్శకులు ఈ మధ్య కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి మరో కొత్త కథనే ఈ చిత్రం. చనిపోయిన తర్వాత శ్మశానం కొరత అనే సామాజిక సమస్యను వినోదంతో మేళవించి తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు ఐవీ శశి కొంతవరకు సఫలమయ్యారు. కీర్తి (Keerti Suresh) విషయానికి వస్తే ఇప్పటివరకు గ్లామర్, డీ-గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న ఈ భామ చాలా రోజుల తర్వాతప్రత్యేకమైన పాత్రలో నటించింది. అపూర్వ అనే గ్రామ పెద్దగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెకు శ్మశానం సమస్య ఎదురవ్వడం. ఈ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించామని అనుకునేలోపు నలుగురు చనిపోవడంతో అది మరింత తీవ్రమవ్వడం ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే ఈ సినిమాలో దర్శకుడు శ్మశానం చుట్టూ ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలను చూపించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Thammudu Movie Review: తమ్ముడు మూవీ రివ్యూ!