हिन्दी | Epaper

Trisha Krishnan: నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

Saritha
Trisha Krishnan: నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష

Trisha Krishnan: నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. మైక్రోఫోన్ చేతికి దొరికినంత మాత్రాన మాట్లాడే మాటల్లో తెలివి ఉండదని, అది కేవలం మూర్ఖత్వాన్ని మాత్రమే ప్రదర్శిస్తుందని ఆమె చురకలంటించారు.

Read Also: Dhurandhar 2 Telugu Trailer: ‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

ఘాటుగా స్పందించిన త్రిష

ఇటీవల జరిగిన గలాటా అవార్డ్స్ కార్యక్రమంలో గతంలో తను కలిసి పనిచేసిన నటీనటులపై అభిప్రాయం చెప్పాలని పార్థిబన్‌ను కోరారు. ఈ క్రమంలో తెరపై త్రిష ఫొటో కనిపించగానే, ఆయన ఆమె పేరును నేరుగా ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. “ఈ కుందవైని కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచాలి. బయటకు రాకుండా చూసుకోవాలి. అదే మంచిది” అని అన్నారు. ఇటీవల నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌తో కలిసి త్రిష ఒక వివాహ వేడుకలో కనిపించిన నేపథ్యంలో పార్థిబన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Trisha Krishnan: నటుడు పార్థిబన్ వ్యాఖ్యలకు స్పందించిన త్రిష
Trisha Krishnan: Trisha responds to actor Parthiban’s comments

త్రిష తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా గట్టిగా బదులిచ్చారు. సదరు కార్యక్రమంలో తన పేరు, ఫోటోను చివరి నిమిషంలో చేర్చాలని పార్థిబన్ తన అసిస్టెంట్ ద్వారా ఆర్గనైజర్లకు చెప్పించారని త్రిష వెల్లడించారు. “చేతిలో మైక్ ఉన్నంత మాత్రాన మాట్లాడే మాటలు తెలివైనవిగా లేదా హాస్యంగా ఉండవు. అది మాట్లాడే వారి మూర్ఖత్వాన్ని మరింత గట్టిగా వినిపిస్తుంది అంటూ ఆమె నిప్పులు చెరిగారు.

క్షమాపణ చెప్పిన పార్థిబన్

త్రిష చేసిన పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభించడంతో పాటు, పార్థిబన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వివాదం ముదరడంతో నటుడు పార్థిబన్ వెనక్కి తగ్గారు. ఈ నెల 8న తన ఎక్స్ ఖాతా ద్వారా త్రిషకు క్షమాపణలు చెబుతూ పోస్ట్ చేశారు. ఆమెను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870