తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Tollywood) ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఇక వైస్ ప్రసిడెంట్‌గా సూర్యదేవర నాగవంశీ ఎన్నిక కాగా.. ఫిల్మ్ చాంబర్ (Tollywood) కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. అయితే నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సురేష్ బాబు ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నారు.
Read Also: Tollywood: తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఫలితాలు ఇవే!
సెక్టార్ల వారీగా ఫలితాలు:
ఎగ్జిబిటర్స్ సెక్టార్: ఈ విభాగంలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏకపక్ష విజయం సాధించింది. మొత్తం గెలిచిన వారిలో 14 మంది ప్రోగ్రెసివ్ వారే కాగా, మన ప్యానెల్ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.

డిస్ట్రిబ్యూషన్ సెక్టార్: 12 ఈసీ స్థానాలకు గానూ ప్రోగ్రెసివ్ ప్యానెల్ 8 స్థానాలు సాధించగా, మన ప్యానెల్ 3 చోట్ల గెలిచింది (ఒక స్థానంలో టై అయింది).
ప్రొడ్యూసర్స్ సెక్టార్: ఇక్కడ మాత్రం మన ప్యానెల్ గట్టి పోటీనిచ్చి 7 స్థానాలు గెలుచుకోగా, ప్రోగ్రెసివ్ ప్యానెల్ 5 స్థానాలను పొందింది.
స్టూడియో సెక్టార్: మన ప్యానెల్ ముగ్గురు సభ్యులతో ఆధిక్యం ప్రదర్శించగా, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒకరు గెలిచారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: