బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మనోజ్ బాజ్‌పేయ్. సత్య, ‘ది ఫ్యామిలీ మ్యాన్’, గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.అయితే ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ ప్రయాణం టురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు బాజ్‌పేయ్. తన కెరీర్‌లో సత్య ఒక మైలురాయిగా నిలిచిబోతుందని చెప్పాడు.బండిట్ క్వీన్ సినిమాతో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. శేఖర్ కపూర్ లాంటి దిగ్గజ దర్శకుడు తీసిన చిత్రంతో గుర్తింపు వస్తుందనుకున్నాను కానీ అలా జరుగలేదు. అయితే బండిట్ క్వీన్ చూసి వర్మ నన్ను సత్య సినిమాకి ఎంపిక చేసుకున్నాడు. మొదట హీరోగా అనుకున్నాను కానీ హీరో స్నేహితుడి పాత్రలో అని దిగులు చెందాను.
ప్రశంసలు
సినిమా విడుదలైన తర్వాత హీరో కంటే హీరో స్నేహితుడి పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. నాకు నిజంగా గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం ‘సత్య’ సినిమానే. ఆ చిత్రంలో నన్ను నమ్మిన రామ్ గోపాల్ వర్మ గారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ప్రతిరోజూ ఆయనను తలుచుకుంటాను. ఆయనతో కలిసి నేను వరుసగా నాలుగు ప్రాజెక్ట్‌లలో పనిచేశాను. మూడు సినిమాల్లో నటించాను, ఒక చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాను. నా సినీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపంటూ మనోజ్ వెల్లడించారు.సినీ పరిశ్రమలో తాను పడ్డ కష్టాల గురించి చెబుతూ 30 ఏండ్ల సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఈ చిత్ర పరిశ్రమలో నిలబడటం అంత సులభమైన విషయం కాదు. ఇక్కడ చాలా పోటీ ఉంటుంది. మన ఎదుగుదలను చూసి తొక్కేవాళ్లు ఉంటారు. అలాంటి పరిస్థితులను తట్టుకుని నిలబడి ఈ స్థాయికి చేరుకున్నానంటూ మనోజ్ చెప్పుకోచ్చాడు.
గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్
తెలుగు పరిశ్రమలోనే కాదు, హిందీ సినీ పరిశ్రమలో కూడా తన సత్తా ఏంటో చూపించాడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ చిత్రాలలో సత్య ఒకటి.ఈ సినిమాలో జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‌పాయ్ కథానాయకులుగా నటించగా ఊర్మిళ మతోండ్కర్, షెఫాలీ షా హీరోయిన్‌లుగా నటించారు. ముంబై మాఫియా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం 1998లో జులై 3న విడుదలై సంచలన విజయం అందుకుంది. అప్పటివరకు మూసధోరణి కథలతో నెట్టుకోస్తున్న బాలీవుడ్‌కి అసలైన సినిమాను పరిచయం చేసింది. అంతేకాకుండా ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సత్తా చాటింది. ఉత్తమ సహాయ నటుడిగా మనోజ్ బాజ్‌పాయ్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు.

ముంబైని అండర్ వరల్డ్ రూల్ చేస్తున్న సమయంలో బ్రతుకుదెరువు కోసం అక్కడికి అనాథగా వస్తాడు సత్య (జేడీ చక్రవర్తి). అయితే ఒక హోటల్‌లో పనిచేస్తున్న సత్యకి లోకల్ డాన్‌తో గొడవ జరగడంతో అతడు సత్యని జైలుకి పంపిస్తాడు. జైలులో ఉన్న సత్యకి అండర్ వరల్డ్ డాన్ భీకూ మాత్రే(మనోజ్ బాజ్ పేయ్)తో గొడవ జరుగుతుంది. అయితే సత్య ధైర్యాన్ని చూసిన భీకూ మాత్రే అతడితో స్నేహం చేయాలని చేతులు కలుపుతాడు. ఈ క్రమంలోనే ఇద్దరు జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ముంబాయి మహా నగరాన్ని ఎలా శాసించారు అనేది ఈ చిత్రం కథ.
Read Also: Karthik Subbaraj: గేమ్ ఛేంజర్ సినిమా ఐడియా నాదే: కార్తీక్ సుబ్బరాజ్