రష్మిక మందన ప్రధాన పాత్రలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend Movie) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Hot Topic:విజయ్-రష్మిక ఎంగేజ్‌మెంట్: అభిమానులకు షాక్
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అయితే చాలా కాలంగా వార్తల్లోనే ఉంటున్న ఈ సినిమా.. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ (Interesting announcement) వీడియో ద్వారా డేట్ వెల్లడించారు.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాన్ని నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. మీరు ఏ టైప్? అంటూ సినిమా కాన్సెప్ట్ (Movie concept) గురించి హింట్ ఇచ్చారు. “అబ్బాయిలు, అమ్మాయిలు, స్త్రీలు, పురుషులు… మీరు ఎప్పుడైనా ఒక రిలేషన్ లో ఉంటే… లేదా భవిష్యత్తులో రిలేషన్ లో ఉండటాలనుకుంటే… మా సినిమా నుండి మీకు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయని నేను భావిస్తున్నాను.
ఇది ఒక ఇంటిమేట్ ఇంటెన్స్ రిలేషన్ షిప్ డ్రామా… ఎటువంటి లెక్చరర్స్ ఉండవు…. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత కథ మాత్రమే ఉంటుంది. మీ టైల్ ఎవరు అనే దానిపై మీరు నిర్ణయం తీసుకుంటారు. ఈ రిలీజ్ డేట్ ప్రోమోను తప్పకుండా చూడండి” అని డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: