గ్లామర్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ దూసుకుపోతోంది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది, రష్మిక. రష్మిక తన కెరియర్లో తొలిసారిగా చేసిన రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమానే ‘థామా’ (Thama Movie). అక్టోబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా, హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. కొన్ని రోజుల క్రితం రెంటల్ విధానంలో (అమెజాన్ ప్రైమ్) స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా, (Thama Movie) ఇప్పుడు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
Read Also: Kriti Sanon: IMDB జాబితాలో కృతి సనన్
కథ
అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ జర్నలిస్ట్. అడవిలోకి అడ్వంచర్ చేయడానికి స్నేహితులతో కలిసి వెళ్తాడు. అదే సమయంలో ఆయనపైకి ఓ ఎలుగుబంటి దాడి చేస్తుంది. అప్పుడే అతడ్ని కాపాడటానికి వస్తుంది తడకా (రష్మిక మందన్న). ఈమె మనిషి కాదు భేతాళ జాతికి చెందింది. వాళ్ల నియమాల ప్రకారం మనుషుల రక్తం తాగకూడదు. కానీ వాళ్ల పూర్వీకుడు, థామా అంటే నాయకుడు అయిన యాక్షసన్ (నవాజుద్ధీన్ సిద్ధిఖీ) ఓసారి నియమాలకు విరుద్ధంగా మనుషుల రక్తం తాగుతాడు.

దాంతో అతన్ని 100 ఏళ్ల పాటు ఓ గుహలో బంధిస్తారు. తనలా మళ్లీ ఎవరైనా భేతాళుడు నియమం తిప్పినపుడే యాక్షసన్‌కు విడుదల. అలాంటి సమయంలో అనుకోకుండా తన నియమం తప్పాల్సి వస్తుంది తడకా. ఆ తర్వాత ఏమైంది..? మధ్యలో భేడియా (వరుణ్ ధావన్) ఎందుకొచ్చాడు అనేది మిగిలిన కథ..
విశ్లేషణ
‘థామా’. టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, విజువల్స్ పరంగా పండుగ చేస్తుంది.అడవిలోని ఒక చీకటి ప్రపంచం .. అక్కడ రక్తం తాగే ఒక రాక్షస లోకం .. శక్తుల కోసం వాళ్లు చేసే పోరాటం .. ఆ తెగకి చెందిన ఓ యువతి, ఓ సాధారణ యువకుడిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు. మానవ ప్రపంచాన్ని వెతుక్కుంటూ ఆమె వెళితే, ఆమె కోసం అతను రాక్షస లోకంలోకి అడుగుపెడతాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: