తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్’ (Tamil Nadu State Film Awards 2026) ను అధికారికంగా ప్రకటించింది. ఈ అవార్డులు 2016 నుంచి 2022 మధ్యకాలంలో విడుదలైన తమిళ సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం తమిళ చిత్ర పరిశ్రమలో అద్భుత ప్రతిభను ప్రదర్శించిన సినిమాలు,
Read Also: Virat Kohli: ఇన్‌స్టాగ్రామ్‌కు కోహ్లీ గుడ్ బై?
నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను గుర్తించి ప్రోత్సహించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. సినిమాలతో పాటు టెలివిజన్ రంగానికి చెందిన కళాకారులకు కూడా స్టేట్ టీవీ అవార్డ్స్‌ను ప్రకటించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 13న సాయంత్రం 4:30 గంటలకు చెన్నైలోని కళైవాణర్ అరంగంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.
‘జై భీమ్’ సినిమా హవా
ఈ అవార్డుల్లో సూర్య(Hero Surya) హీరోగా నటించిన ‘జై భీమ్’(Jai Bhim) సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2021లో విడుదలైన ఈ చిత్రం ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు గెలుచుకొని సంచలనం సృష్టించింది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటి, విలన్, సహాయ నటుడు, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు విభాగాల్లో ఈ సినిమాకు పురస్కారాలు దక్కాయి.

ప్రధాన అవార్డుల వివరాలు:
సంవత్సరం వారీగా ముఖ్య అవార్డులు
2016
ఉత్తమ చిత్రం: మానగరం
ఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి
ఉత్తమ నటి: కీర్తి సురేశ్
2017
ఉత్తమ చిత్రం: ఆరం
ఉత్తమ నటుడు: కార్తి
ఉత్తమ నటి: నయనతార
2018
ఉత్తమ చిత్రం: పరియేరుమ్ పెరుమాల్
ఉత్తమ నటుడు: ధనుష్
ఉత్తమ నటి: జ్యోతిక
2019
ఉత్తమ చిత్రం: అసురన్
ఉత్తమ నటుడు: ఆర్. పార్థిబన్
ఉత్తమ నటి: మంజు వారియర్
2020
ఉత్తమ చిత్రం: కూజంగల్
ఉత్తమ నటుడు: సూర్య
ఉత్తమ నటి: అపర్ణా బాలమురళి
2021
ఉత్తమ చిత్రం: జై భీమ్
ఉత్తమ నటుడు: ఆర్య
ఉత్తమ నటి: లిజోమోల్ జోస్
2022
ఉత్తమ చిత్రం: గార్గి
ఉత్తమ నటుడు: విక్రమ్ ప్రభు
ఉత్తమ నటి: సాయి పల్లవి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: