వరుస ప్రాజెక్టులతో బిజీగా సూర్య – ‘వాడివాసల్’పై అనిశ్చితి?
తమిళ స్టార్ హీరో Surya ఇటీవల ఒక రెట్రో బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పట్ల ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలే వచ్చినా, సూర్య కెరీర్‌ను వెనక్కి తిప్పకుండా ముందుకు నడిపిస్తున్నాడు.
తాజాగా, వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టి తన అభిమానులకు సినిమాల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆర్జే బాలాజీ, వెంకీ అట్లూరి, మరియు వెట్రిమారన్ లాంటి దర్శకులతో కలిసి పనిచేస్తున్నాడు.
ప్రస్తుతం తెరకెక్కుతోన్న ఆర్జే బాలాజీ దర్శకత్వంలో Surya నటిస్తున్న 45వ సినిమా ఒక వినూత్న కాంబినేషన్‌గా నిలవబోతోంది. ఇది యాక్షన్ హంగులతో కూడిన కథాంశంతో రూపుదిద్దుకుంటోంది.
మాస్స్, క్లాస్ రెండింటినీ ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు టీం ప్రయత్నిస్తోంది. మరోవైపు, సూర్య తన 46వ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తుండటం మరో హైలైట్.
ఎమోషన్, ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో ఉండే వెంకీ చిత్రాల బానిసైన ప్రేక్షకులు, ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

వెట్రిమారన్ – సూర్య కాంబోపై నీలి మేఘాలు?
ఇదిలా ఉంటే, తమిళ సినీ అభిమానులను ఎంతో కాలంగా ఆసక్తిగా ఉంచిన ప్రాజెక్ట్ ‘వాడివాసల్’ ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితిలో ఉంది.
ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య నటించనున్న ఈ సినిమా గత కొన్ని సంవత్సరాలుగా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉండిపోయింది.
జల్లికట్టు నేపథ్యంతో తెరకెక్కే ఈ చిత్రంలో పాత్ర కోసం సూర్య ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. జల్లికట్టు కళాకృషికి న్యాయం చేస్తూ, సామాజిక వ్యాఖ్యానాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. వీ క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను ఈ సినిమాను నిర్మించనున్నారు.
తాజా వార్తల ప్రకారం వెట్రిమారాన్ తన తర్వాతి ప్రాజెక్ట్ శింబుతో చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది వాడివాసల్ సినిమానా లేదా కొత్త ప్రాజెక్టా అనేది తెలియాల్సి ఉంది. అయితే, శింబు కూడా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు.
ఇప్పటికే కమల్ హాసన్ థగ్‌లైఫ్‌లో నటించిన శింబు ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లను ఒకే చేశాడు. ఇందులో డ్రాగన్ దర్శకుడు అశ్వత్ మారిముత్తుతో ఒక సినిమా కాగా..
దేశింగు పెరియసామి, రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు. మరోవైపు వాడివాసల్ ఆగిపోయిందా.. లేదా వాయిదా పడిందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
వాడివాసల్ – వాయిదా పడిందా? రద్దయిందా?
‘వాడివాసల్’ ప్రాజెక్ట్ పై ఇప్పటి వరకు వస్తున్న వార్తలను బట్టి ఇది పూర్తిగా రద్దయిందా లేదా కేవలం వాయిదా పడిందా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.
ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఎక్కువ కాలం ఉండిపోవడం, షూటింగ్‌కు ఎలాంటి ప్రకటనలు లేకపోవడం సినిమా భవితవ్యంపై సందేహాలు కలిగిస్తున్నాయి.
అయితే వెట్రిమారన్ కథను వదిలే వ్యక్తి కాదన్న నమ్మకంతో, అభిమానులు ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పటికైనా తెరపై చూస్తామనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ సూర్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లైతే, కథను కొనసాగించాలంటే కొత్త హీరోతో చేయాల్సి వస్తుంది. అప్పుడు శింబు పేరే చర్చల్లోకి రావడం సహజం.
Read also: Ranbir Kapoor: రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ కపూర్ కొత్త లుక్