వీకెండ్ కావడంతో ‘బార్డర్-2’ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా హౌస్‌ఫుల్ షోస్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దేశభక్తి భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Read Also: Vijay: జననాయగన్ సెన్సార్ వివాదం.. నేడు హైకోర్టు తీర్పు

సన్నీ డియోల్ పవర్‌ఫుల్ ప్రెజెన్స్
సన్నీ డియోల్(SunnyDeol) నటన సినిమాకు ప్రధాన బలంగా మారింది. ఆయన డైలాగ్స్, యాక్షన్ సీన్స్‌కు అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. గతంలో వచ్చిన ‘బార్డర్’ సినిమాను గుర్తు చేస్తూ, ఈ సీక్వెల్ కూడా అదే స్థాయిలో ఎమోషన్‌ను అందించిందని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మ్యూజిక్, టెక్నికల్ విలువలకు ప్రశంసలు
ఈ చిత్రంలోని నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యుద్ధ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించిన విధానం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చిందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే ‘బార్డర్-2’(SunnyDeol) త్వరలోనే 200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని బాక్సాఫీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సినిమాకు మంచి స్పందన లభిస్తున్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: