
సంక్రాంతి పండుగ అంటేనే గాలిపటాలు, పందెం, సందడి. ఈ కల్చర్‌ని, స్నేహాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే పతంగ్. (Sundeep Kishan) కొత్త నటీనటులతో, సికింద్రాబాద్ బస్తీ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై భారీ ఆఫర్‌ను ప్రకటించాడు సందీప్ కిషన్.(Sandeep Kishan) ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ‘పతంగ్’ చిత్రాన్ని మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు సందీప్ కిషన్ ఏకంగా 500 సినిమా టికెట్లను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Shivaji: వార్నింగ్ ఇస్తే భయపడే రకం కాదు: శివాజీ ఘాటు వ్యాఖ్యలు
వివాహ భోజనంబు’లో 20% డిస్కౌంట్
ఈ అనూహ్య నిర్ణయంతో సామాన్య ప్రేక్షకులు సైతం థియేటర్లకు వెళ్లి సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం కలిగింది. సినిమా పట్ల సందీప్ చూపిస్తున్న ఈ ప్యాషన్ పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (Sundeep Kishan) మరోవైపు సినిమా వినోదంతో పాటు, కడుపునిండా భోజనం చేసేందుకు కూడా సందీప్ అదిరిపోయే ప్లాన్ చేశారు. ‘పతంగ్’ సినిమా టికెట్ చూపించిన వారికి తెలుగు రాష్ట్రాల్లోని అతడి ప్రసిద్ధ ‘వివాహ భోజనంబు’ (Vivaha Bhojanambu) రెస్టారెంట్లలో బిల్లుపై 20 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభించనున్నట్లు తెలిపాడు. సినిమా చూసిన ప్రేక్షకులు ఫిజికల్ టికెట్ లేదా ఆన్‌లైన్ బుకింగ్ స్క్రీన్ షాట్ చూపిస్తే చాలు. ఆది నటించిన శంబాల సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ‘వివాహ భోజనంబు’ Vivaha Bhojanambu రెస్టారెంట్లలో భోజనం చేస్తే వారికి 20 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభించనున్నట్లు సందీప్ తెలిపాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: