हिन्दी | Epaper

SS Rajamouli: ఆర్ఆర్ఆర్ 2 పై అప్డేట్ ఇచ్చిన జక్కన్న

Sharanya
SS Rajamouli: ఆర్ఆర్ఆర్ 2 పై అప్డేట్ ఇచ్చిన జక్కన్న

ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించింది. రామ్ చరణ్, ఎన్‌టీఆర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం గర్వకారణంగా నిలిచింది. ఇక తాజాగా జరిగిన లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ ప్రీమియర్ ఈ సినిమాకు మరింత గ్లోబల్ గుర్తింపు తీసుకొచ్చింది.

రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీమియర్

ఇటీవ‌ల లండ‌న్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఆర్ఆర్ఆర్ చిత్ర లైవ్ కాన్సర్ట్, ప్రీమియర్ ప్రదర్శన జరిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్రీమియ‌ర్‌కి చ‌ర‌ణ్‌, తార‌క్ త‌మ ఫ్యామిలీల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. అలాగే జ‌క్క‌న్న‌, సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి కూడా వ‌చ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్క‌టిగా ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

వైరల్ వీడియోలో రాజమౌళికి ఉపాస‌న ప్రశ్న?

ఈ కార్యక్రమానికి సంబంధించి ఉపాసన కొణిదెల తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఎన్‌టీఆర్(NTR) , రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) క‌లిసి జ‌క్క‌న్న‌ను ఆట‌ప‌ట్టించ‌డం మ‌నం చూడొచ్చు. వారిద్ద‌రు చేసే అల్ల‌రికి రాజ‌మౌళి భ‌య‌పడిపోతుండ‌డం వీడియోలో ఉంది. ఈ క్ర‌మంలో రాజ‌మౌళిని ఉపాస‌న ఆస‌క్తిక‌ర‌ ప్ర‌శ్న అడిగారు. రాజమౌళి గారు ఇప్పుడు మీరు ‘ఆర్ఆర్ఆర్ 2’ చేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. దీనికి జ‌క్క‌న్న‌ ‘ఎస్’ అని సమాధానం చెప్పారు. దాంతో వెంటనే ఉపాసన గాడ్ బ్లెస్ యు అని స్పందించారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్ 2’ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో అనే చ‌ర్చ మొద‌లైంది. అయితే, రాజ‌మౌళి సీరియ‌స్‌గానే చెప్పారా? లేక స‌రదాగా స్పందించారా? అని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Read also: Actress: సూరితో నటించడం గర్వంగా ఉంది: ఐశ్వర్య లక్ష్మీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సల్మాన్ ఖాన్ మూవీకి కొత్త టైటిల్ ‘మాతృభూమి  మే వార్ రెస్ట్ ఇన్ పీస్’

సల్మాన్ ఖాన్ మూవీకి కొత్త టైటిల్ ‘మాతృభూమి  మే వార్ రెస్ట్ ఇన్ పీస్’

ఈ వారం ఓటీటీలో సందడి చేసే వెబ్ సిరీస్‌లు ఇవే!

ఈ వారం ఓటీటీలో సందడి చేసే వెబ్ సిరీస్‌లు ఇవే!

ఇప్పుడు ఓటీటీదే హవా! టాప్-5 క్రేజీ డీల్స్ ఇవే

ఇప్పుడు ఓటీటీదే హవా! టాప్-5 క్రేజీ డీల్స్ ఇవే

మౌనీ రాయ్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్

మౌనీ రాయ్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్

ఆస్కార్‌ ‘ఇన్ మెమోరియం’లో కోట శ్రీనివాసరావు పేరు

ఆస్కార్‌ ‘ఇన్ మెమోరియం’లో కోట శ్రీనివాసరావు పేరు

ఆస్కార్ వేదికపై ప్రియాంక చోప్రా

ఆస్కార్ వేదికపై ప్రియాంక చోప్రా

ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ సరికొత్త చరిత్ర

ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ సరికొత్త చరిత్ర

అవతార్ 3 కి ఆస్కార్ అవార్డు: భారతీయ సినీ అభిమానుల ఆగ్రహం!

అవతార్ 3 కి ఆస్కార్ అవార్డు: భారతీయ సినీ అభిమానుల ఆగ్రహం!

ఫౌజీ’మూవీ క్రేజీ అప్‌డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే!!

ఫౌజీ’మూవీ క్రేజీ అప్‌డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే!!

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

📢 For Advertisement Booking: 98481 12870