బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ (Anil Kapoor) కుమార్తె, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్(Sonam Kapoor) రెండోసారి తల్లి కాబోతోంది. వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను సోనమ్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. నిన్న ఆమె సీమంతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు, కొందరు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
Read Also: Thalapathy Vijay: ఒకే ఫ్రేమ్ లో వైఎస్ జగన్.. కోలీవుడ్ హీరో

హాజరైన బాలీవుడ్ స్టార్లు
సీమంతం వేడుకలో లెమన్ గ్రీన్ కలర్ లెహంగా చోళీలో సోనమ్(Sonam Kapoor) మెరిసిపోయింది. ఈ వేడుకు కరీనా కపూర్, భూమి పెడ్నేకర్, షబానా అజ్మీ, ఖుషీ కపూర్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్, మహీప్ కపూర్ వంటి వారు హాజరయ్యారు. 2015లో ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా ప్రమోషన్స్ సమయంలో సోనమ్, ఆనంద్ అహూజాల మధ్య పరిచయం ఏర్పడింది. వారి స్నేహం ప్రేమగా మారి 2018లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 2022లో వీరికి కుమారుడు వాయు జన్మించారు. ఇప్పుడు ఆమె రెండోసారి తల్లి కాబోతోంది. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సోనమ్‌తో దిగిన ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ, డియర్ సోనమ్ నీ సీమంతం వేడుకకు నా ప్రేమ, ఆశీస్సులు అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: