हिन्दी | Epaper

Singer: అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ పై స్పందించిన గాయని చిన్మయి

Anusha
Singer: అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ పై స్పందించిన గాయని చిన్మయి

ఆధునిక కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లేబ్యాక్ సింగర్‌ (Singer) లలో ఒకరైన అర్జిత్ సింగ్ ఇకపై ప్లేబ్యాక్ సింగింగ్‌కు దూరంగా ఉంటానని ప్రకటించడం సంగీత ప్రియులను భావోద్వేగానికి గురిచేసింది. ఎన్నో మధుర గీతాలతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న అర్జిత్ , ఇకపై కొత్త ప్రాజెక్టులు ఏవీ స్వీకరించబోనని స్పష్టం చేయడంతో ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్లినట్లైంది.

Read Also: AR Rahman : రహమాన్ వ్యాఖ్యలు తప్పా? ముఖేష్ రిషి సంచలన స్పందన

నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరు

సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఈ ప్రకటనపై అభిమానులు, సంగీతకారులు, గాయకులు భావోద్వేగంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జిత్ తో కలిసి పలు హిట్ పాటలు పాడిన ప్రముఖ గాయని (Singer) చిన్మయి శ్రీపాద స్పందించింది.. చిన్మయి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో స్పందిస్తూ, ప్రీతమ్ సంగీత దర్శకత్వంలో రికార్డింగ్ సమయంలో తొలిసారి, అర్జిత్ ను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటికి ‘తుమ్ హి హో’ విడుదల కాకముందే అతను పరిశ్రమను శాసిస్తాడన్న అంచనాలు ఎవరికీ లేకపోయినా, అర్జిత్ లో మాత్రం అసాధారణమైన నిబద్ధత, వినయం కనిపించిందని ఆమె పేర్కొన్నారు.

స్టార్ సింగర్‌గా ఎదిగిన తర్వాత కూడా అతనిలో ఎలాంటి మార్పు రాలేదని చిన్మయి ప్రశంసించారు. అర్జిత్ గురించి మరింతగా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడిన చిన్మయి .. “అతను నా ఫేవరెట్ గాయకుల్లో ఒకడు మాత్రమే కాదు… నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో ఒకడు. సంగీతాన్ని అతను చూసే విధానం, ప్లాన్ చేసుకునే తీరులో ఏదో దైవికత ఉంటుంది. ఎప్పుడూ అత్యున్నత స్థాయినే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశాడు” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కోకాపేటలో అల్లు సినిమాస్ ని ప్రారంభించిన సీఎం

కోకాపేటలో అల్లు సినిమాస్ ని ప్రారంభించిన సీఎం

గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

హైదరాబాద్‌లో కల్తీ పెరుగు దందా.. 2,500 కిలోలు స్వాధీనం

హైదరాబాద్‌లో కల్తీ పెరుగు దందా.. 2,500 కిలోలు స్వాధీనం

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం
1:38

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

రోగికి మత్తు మందు ఇచ్చి 10 తులాలు దోచుకున్నఫేక్ డాక్టర్

రోగికి మత్తు మందు ఇచ్చి 10 తులాలు దోచుకున్నఫేక్ డాక్టర్

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

📢 For Advertisement Booking: 98481 12870