సిల్క్ స్మిత తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఆమె గ్లామర్ క్వీన్. 80, 90వ దశకంలో స్పెషల్ పాటలతో ఊర్రూతలూగించింది. మత్తెక్కించే కళ్లు కట్టిపడేసే యాక్టింగ్ మైమరపించే స్టెప్పులతో వెండితెరపై సందడి చేసింది. ఆమె మరెవరో కాదు నిషా కళ్ల సుందరి సిల్క్ స్మిత. అప్పట్లో స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు అగ్ర హీరోలు సైతం సిల్క్ స్మిత డేట్స్ కోసం వెయిట్ చేసేవాళ్లు. సిల్క్ స్మిత స్పెషల్ సాంగ్ ఉందంటే ఆ సినిమా కోసం థియేటర్ల బయట క్యూ కట్టేవాళ్లు. గ్లామర్ పాత్రలే కాదు ఢీగ్లామర్ పాత్రలలోనూ కట్టిపడేసింది. అలాగే విలన్ పాత్రలలోనూ అదరగొట్టింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది.అతి తక్కువ సమయంలోనే దక్షిణాదిలో తనదైన ముద్రవేసింది సిల్క్ స్మిత. నటిగానే కాకుండా నిర్మాతగానూ నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టింది. కానీ గ్లామర్ క్వీన్(Glamour Queen) గా స్టార్ డమ్ సంపాదించుకున్న సిల్క్ స్మిత నిర్మాతగా మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. తెలుగులో ఆమె మూడు సినిమాలు నిర్మించింది. అయితే అప్పుడే ఆమె ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది. మూడు సినిమాల నిర్మాణం కారణంగా ఆర్థికంగ తీవ్రంగా నష్టపోయింది.ఎస్సార్ సినీ ఎంటర్ ప్రైజెస్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ నిర్మాణ సంస్థలో ప్రేమించు చూడు అనే సినిమాను నిర్మించింది. ఇందులో రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్(Chandramohan) హీరోలుగా నటించగా సిల్క్ స్మిత కథానాయికగా నటించింది. ముందుగా ఈ సినిమాకు బ్రహ్మా నీ తలరాత తారుమారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ అప్పట్లో ఈ టైటిల్ పై అభ్యంతరాలు రావడంతో చివరకు ప్రేమించిచూడు అనే టైటిల్ పెట్టారట. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

వీరవిహారం
మరోవైపు సెక్రటరీ మోసం చేయడంతో నగలు తాకట్టుపెట్టి మరి సినిమా కోసం చేసిన అప్పులు తీర్చింది. ఆ తర్వాత నా పేరు దుర్గ అనే సినిమాను నిర్మించింది. ఈ మూవీ రిలీజ్ కాలేదు. ఆ తర్వాత తమిళంలో వీరవిహారం అనే చిత్రాన్ని నిర్మించింది. కానీ అనివార్య కారణాలతో ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. నటిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన సిల్క్ స్మిత ప్రేమించినవాడు మోసం చేయడంతో 1996లో ఆత్మహత్య చేసుకుంది.
Read Also: Film Director: తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్న బుచ్చిబాబు