థియేటర్లలో హిట్.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోన్న ‘‘సికందర్’’!
ఇటీవల కాలంలో థియేటర్లలో ఘన విజయం సాధించిన చిత్రాలు నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిత్రాలైనా, భారీ బడ్జెట్ సినిమాలైనా – డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల దిశగా వేగంగా దూసుకెళ్తున్నాయి. తాజాగా బాక్సాఫీస్ వద్ద రూ.177 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘‘సికందర్’’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘‘నెట్‌ఫ్లిక్స్’’ లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, విడుదలైన రెండు నెలల వ్యవధిలోనే డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి హైప్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది.

రష్మిక మందన్నా హవా.. యూత్ ఐకాన్‌గా ఫుల్ జోష్‌లో నేషనల్ క్రష్
ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో యూత్‌ను ఊపేస్తున్న నటీమణుల్లో రష్మిక మందన్నా పేరు ముందు వరుసలో నిలుస్తోంది. పుష్ప 2, యానిమల్, ఛావా వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో ఆమె నేషనల్ క్రష్‌గా అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘‘సికందర్’’ సినిమాతో మరోసారి తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో నిరూపించుకుంది. బాలీవుడ్ బాద్‌షా సల్మాన్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ మీద నటించడం కూడా ఆమె కెరీర్‌కు ఓ మైలురాయి. ఈ జోడీపై సినిమా విడుదలకు ముందే వయస్సు తేడాల విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే సల్మాన్ ఖాన్ చాలా బలమైన కౌంటర్‌తో ఆ విమర్శలకు చెక్ పెట్టారు. విడుదలైన తర్వాత వీరి కెమిస్ట్రీ ప్రేక్షకుల మనసు దోచుకోవడంలో సక్సెస్ అయ్యింది.
భారీ బడ్జెట్.. మిక్స్‌డ్ టాక్ ఉన్నా ఫుల్ కలెక్షన్స్
డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.177 కోట్లు రాబట్టింది. నడియడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ల పై నిర్మించిన ఈ మూవీ మార్చి 30న థియేటర్లలో విడుదలైంది. దాదాపు రూ.200 కోట్లతో నిర్మించిన ఈ సినిమా అంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా మూడు భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో మూడు భాషల్లో స్ట్రీమింగ్
‘‘సికందర్’’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు అరబిక్, జులు భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇది పాన్ ఇండియా వ్యాపార ప్రణాళికలో భాగంగా తీసుకున్న కీలక నిర్ణయంగా చెప్పొచ్చు. దీని ద్వారా భారతీయ ప్రేక్షకులే కాదు, విదేశీ మార్కెట్‌ను కూడా టార్గెట్ చేయడం మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లలేకపోయిన వారు ఇప్పుడు ఇంట్లోనే సల్మాన్, రష్మిక యాక్షన్, రొమాన్స్, ఎమోషన్‌ల మేళవింపుతో కూడిన ఈ సినిమాను ఆస్వాదించొచ్చు.
Read also: Kamal Haasan: ‘థగ్ లైఫ్’ వేడుకలో కమల్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు