శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “45”. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా “45” సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
స్పెషల్ ప్లేస్
రీసెంట్ గానే చెన్నైలోని పీవీఆర్ సత్యం థియేటర్‌లో ఈ చిత్ర తమిళ టీజర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో హీరోలు శివరాజ్ కుమార్, ఉపేంద్రతో పాటు దర్శకుడు అర్జున్ జాన్య, నిర్మాత రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి. చెన్నై తన జీవితానికి చాలా స్పెషల్ ప్లేస్ అని చెప్పుకొచ్చారు. తాను ఇక్కడే పుట్టాను, పెరిగాను, చదివాను అని తెలిపారు. తనకొచ్చిన మొదటి అవకాశం ఇక్కడి నుంచే అని ఎన్నో మధుర జ్ఞాపకాలు ఈ నగరంతో ఉన్నాయని చెప్పుకొచ్చారు.

పెద్ద సవాళ్లూ
తాను ఎప్పుడూ హీరో కావాలని కోరుకోలేదని, తనకు హీరో అంటే కమలహాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లే అని, వాళ్లే తన ఫేవరెట్స్ అని చెప్పారు. ముఖ్యంగా కమలహాసన్ గురించి మాట్లాడుతూ, “ఆయనంటే నాకు ఎంత ఇష్టం అంటే, నేను అమ్మాయినైతే ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకునేవాడిని” అని హాస్యంగా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా నటుడిగా ఎన్నో విజయాలు, అపజయాలను ఎదుర్కొన్నానని వెల్లడించారు. కానీ వాటిని ఎప్పుడూ తలకెక్కించుకోలేదని జీవితంలో పెద్ద సవాళ్లూ ఎదురయ్యాయని వాపోయారు. తల సర్జరీ, క్యాన్సర్ వంటి అనుభవాలనూ దాటి వచ్చానని చెప్పారు. ఇప్పుడు తిరిగి కెమెరా ముందు నిలబడగలగడం ఆనందంగా ఉందని అన్నారు.దర్శకుడు అర్జున్ జన్యా 45 సినిమా కథను నాకు నాలుగు నుంచి ఐదు నిమిషాలు చెప్పారు. అలా ఈ సినిమాకు 45 అనే టైటిల్ పెట్టుకున్నాం. కథ చెప్పాక అర్జున్ జన్యా మరో దర్శకుడికి ఎవరికైనా డైరెక్షన్ బాధ్యతలు ఇస్తానని అన్నాడు. ఈ కథకు నువ్వే న్యాయం చేయగలవు అని చెప్పి అర్జున్ ను ఒప్పించాను. ఈ చిత్రంలో ఉపేంద్రతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అతను ఎంతో టాలెంటెడ్. సినిమానే లోకంగా బతుకుతుంటాడు. ఎన్నో విషయాలు ఉపేంద్ర నుంచి నేర్చుకున్నానఅని తెలిపారు.
Read Also: Kalyan Ram: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న కళ్యాణ్ రామ్