శిల్పా శెట్టి పై ముంబై పోలీసుల సుదీర్ఘ విచారణ
బాలీవుడ్ నటి శిల్పా(Shilpa Shetty) శెట్టి రూ. 60 కోట్ల మోసం కేసులో చిక్కుకున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్న ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం అధికారులు ఆమెను నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు. పోలీసులు ఆమె ఇంటికే వెళ్లి విచారణ జరిపి, శిల్పా(Shilpa Shetty) వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.ఈ కేసు వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఫిర్యాదు ఆధారంగా నమోదైంది. ఆయన ఆరోపణల ప్రకారం, 2015 నుండి 2023 మధ్య కాలంలో వ్యాపార విస్తరణ పేరుతో శిల్పా శెట్టి(Shilpa Shetty)మరియు ఆమె భర్త రాజ్ కుంద్రా తమ వద్ద నుంచి రూ. 60 కోట్లకు పైగా తీసుకుని, ఆ మొత్తాన్ని వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించారు.

Read also Vijay Devarakonda Car : విజయ్ దేవరకొండ కారుకు ట్రాఫిక్ ఫైన్..ఎంత స్పీడ్ లో ఉందొ తెలుసా..?
బ్యాంకు ఖాతా లావాదేవీలపై పోలీసులు దృష్టి
విచారణ సందర్భంగా శిల్పా శెట్టి(Shilpa)తనకు సంబంధించిన అడ్వర్టైజింగ్ కంపెనీ బ్యాంకు లావాదేవీల వివరాలు పోలీసులకు అందజేశారు. ఆమె ఇచ్చిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే కేసులో గత సంవత్సరం సెప్టెంబరులో రాజ్ కుంద్రాను కూడా ఈఓడబ్ల్యూ అధికారులు విచారించారు.రాజ్ కుంద్రా విచారణలో కొన్ని కీలక ఆర్థిక వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మోసానికి గురైన డబ్బులో కొంత భాగం నటీమణులు బిపాసా బసు, నేహా ధూపియాలకు చెల్లించబడిందని ఆయన తెలిపినట్లు వార్తలు వచ్చాయి. పోలీసులు కంపెనీ ఖాతాల నుంచి శిల్పా, బిపాసా, నేహా, అలాగే బాలాజీ ఎంటర్టైన్మెంట్ సంస్థకు నిధులు బదిలీ అయినట్లు గుర్తించారు. దీంతో కేసు దర్యాప్తు మరింత వేగం అందుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: https://epaper.vaartha.com/
Read Also: