శంకర్ (Shankar) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) కమల్ హాసన్‌తో పాటు, ‘గేమ్ ఛేంజర్’ రామ్ చరణ్‌తో రూపొందిన ఈ రెండు చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై మిశ్రమ స్పందనకు గురయ్యాయి. కథనంలో లోపాలు, స్క్రీన్ ప్లే మీద నిరాశతో ఈ చిత్రాలు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రత్యేకంగా శంకర్‌కు గుర్తింపు తీసుకువచ్చిన “టెక్నికల్ మ్యాజిక్” కొత్తగా కనిపించకపోవడం అభిమానులను ఆలోచింపజేసింది. ఈ సినిమాల ఫెయిల్యూర్స్ (Movie failures) కారణంగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రకటించారు.

‘వేల్పారి’ – మరో డ్రీమ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం
ఓ కార్యక్రమంలో శంకర్ (Shankar) మాట్లాడుతూ ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రోబో’ (‘robot’) అని చెప్పారు. ఇప్పుడు ‘వేల్పారి’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రానుందని ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద చిత్రాల్లో ఇది ఒకటి అవుతుందని చెప్పారు. ఈ సినిమాకు భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్, టెక్నాలజీ, ఆర్ట్ డిజైన్స్ అవసరమవుతాయని తెలిపారు.
హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ – గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ స్థాయిలో
‘అవతార్’, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి చిత్రాలకు ఉపయోగించిన సాంకేతికతను పరిచయం చేయనున్నారు. ప్రపంచమంతా దీన్ని గుర్తిస్తుందని తన కల త్వరలోనే నిజం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు .
డైరెక్టర్ ఎస్. శంకర్ ?
ఎస్. శంకర్ ఒక ప్రముఖ భారతీయ చిత్రదర్శకుడు. ఆయన అధిక బడ్జెట్, దృష్టిని ఆకట్టుకునే విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన చిత్రాలకుగాను ప్రసిద్ధి పొందారు. సామాజిక అంశాలను ఆవిష్కరించే చిత్రాలు తెరకెక్కించడంలో శంకర్ ప్రత్యేకత కలిగిన దర్శకుడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Vintara Saradaga Movie: ‘వింటారా సరదాగా’ టీజర్ చూసారా?