ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘శంబాల’ (Shambhala Movie). యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా, టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, డిసెంబర్ 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. 12 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 20 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 14 కోట్లకి పైకి నెట్ ను వసూలు చేసింది. చాలా గ్యాప్ తరువాత ఆదిసాయికుమార్ సాధించిన హిట్ సినిమాగా ఇది నిలిచింది.
Read Also: Film News:కృతి షెట్టి–చిరు కాంబో: టాలీవుడ్‌లో నూతన అంచనాలు

అలాంటి ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా? అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థియేటర్స్ వైపు నుంచి కన్నా ఓటీటీ వైపు నుంచి (Shambhala Movie) ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందనే అభిప్రాయాలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా, ఈ రోజునే ‘ఆహా’ (AHA) ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. ఆది సాయికుమార్ తో పాటు అర్చన అయ్యర్ శ్వాసిక మధునందన్ రవివర్మ రామరాజు సిజూ తదితరులు కీలకమైన పాత్రలను పోషించారు.
కథ విషయానికి వస్తే ‘శంబాల’ అనే ఒక మారుమూల పల్లెలో ఒక ‘ఉల్క’ పడుతుంది. అప్పటి నుంచి ఆ ఊరిలో అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆ ఉల్కను అందరూ కూడా ‘బండభూతం’ అని పిలుస్తుంటారు. అక్కడి మూఢనమ్మకాలను తరిమికొట్టడం కోసం విక్రమ్ వస్తాడు. ఆ ఊళ్లో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? జరుగుతున్న సంఘటనలకు కారకులు ఎవరు? అనేది కథ.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: