టాలీవుడ్‌లో మరో స్టార్ ఎంట్రీకి వేదిక సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya) తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఓ భారీ ప్రాజెక్ట్ చేయడం ఇప్పటికే తెలిసిందే. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ‘Suriya 46’ (‘Surya 46’) అనే వర్కింగ్ టైటిల్‌తో కొనసాగుతుంది. ఇది తెలుగు – తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది.
Read Also: Bigg Boss 9: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ .. రమ్య మోక్ష అవుట్
చిత్రంకి సంబంధించిన ఒక్కో అప్‌డేట్‌తో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. కాస్టింగ్ కి సంబంధించి మేకర్స్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.సూర్య (Surya) 46వ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు (Mamita Baiju) కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ (Raveena Tandon) ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఆమె పుట్టినరోజు (అక్టోబర్ 26) సందర్భంగా సినిమా యూనిట్ రవీనాకు బర్త్‌డే విషెస్ చెబుతూ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. “మీరు మా ప్రయాణంలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది… రాబోయే అద్భుతమైన జర్నీ కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రమికా సేన్ పాత్రకి దేశవ్యాప్తంగా ప్రశంసలు
తొలి ప్రేమ, సార్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించారు. ఇప్పుడు వర్సటైల్ యాక్టర్ సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఆయనకి తోడుగా రవీనా టాండన్ లాంటి పాపులర్ బాలీవుడ్ నటి (Bollywood actress) ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతుండటంతో ఆడియన్స్ మరింత ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఇందులో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.
కాగా, ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రవీనా టాండన్, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె గతంలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సరసన ‘బంగారు బుల్లోడు’, అక్కినేని నాగార్జునతో ‘ఆకాశవీధిలో’ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు.
తర్వాత 2014లో మోహన్ బాబుతో కలిసి ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో కనిపించారు. ఇటీవల ‘కేజీఎఫ్ 2’లో రమికా సేన్ పాత్రకి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఇప్పుడు దాదాపు పదేళ్ల విరామం తర్వాత రవీనా టాండన్ ‘సూర్య 46’ ద్వారా టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: