చాలా రోజుల తర్వాత రామ్ మళ్లీ ఓ ప్రేమ కథలో నటిస్తున్నట్టుగా ఉంది. ఇన్నాళ్లు మాస్ మంత్రం జపిస్తూ గుబురు గడ్డంతో కనిపించేవాడు. కానీ ఈ సారి స్లిమ్ అండ్ క్లీన్ లుక్‌లో అమ్మాయిల మనసు దోచే మునుపటి రామ్ కనిపించబోతోన్నాడు. రామ్, భాగ్య శ్రీ కాంబోలో మహేష్ బాబు. పి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ అంటూ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో సినిమా కాన్సెప్ట్ ఏంటో కూడా చెప్పినట్టు అనిపిస్తుంది.సినిమా థియేటర్ టికెట్ల కోసం పలుకు బడిని వాడటం ఎమ్మెల్యే, పోలీస్ తాలుకా అంటూ ఇలా టికెట్లు తీసుకుంటూ ఉండటం.ఆంధ్రా కింగ్ సూర్య సినిమా అంటే మామూలు విషయమా? అని చెప్పడం, మన హీరో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ అని చెప్పి,ఆంధ్ర కింగ్ తాలుకా అని యాభై టికెట్లు తీసుకోవడవం వంటివి చూస్తుంటే నిజంగానే ఇదొక ఫ్యాన్ బయోపిక్‌లానే అనిపిస్తోంది.చూస్తుంటే ఆంధ్రా కింగ్ తాలుకా అని ఏదో తెలుగు హీరోని పెట్టకుండా ఉపేంద్ర(Upendra)ను పెట్టారు. నిజంగా ఒక వేళ తెలుగు హీరోని రిఫరెన్సుగా తీసుకుని పెట్టి ఉంటే మాత్రం పెద్ద రచ్చే జరిగేది. ఆంధ్రా కింగ్ అని పవన్ కళ్యాణ్ అంటే మహేష్ బాబు ఫ్యాన్స్, మహేష్ బాబుని ఆంధ్ర కింగ్ అని అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్‌కి దిగేవారు. ఇక ఇలా తెలుగులో ఏ హీరోని రిఫరెన్సుగా తీసుకున్నా దెబ్బ పడేది. అందుకే మేకర్లను ఉపేంద్రను తీసుకొచ్చి ఓ కల్పిత పాత్రను వేయించారనిపిస్తోంది.
ఉపేంద్ర
అసలే భాగ్య శ్రీకి మిస్టర్ బచ్చన్ రిమార్క్ ఉండిపోయింది. గ్లామర్ బాగానే ఉన్నా కూడా లక్ అంతగా లేనట్టుగా ఉంది. మిస్టర్ బచ్చన్ బ్లాక్ బస్టర్ అయి ఉంటే భాగ్య శ్రీకి మరిన్ని ఆఫర్లు వచ్చి ఉండేవి. మరి రామ్‌తో చేస్తున్న ఈ మూవీ అయినా భాగ్య శ్రీ ఫేట్ మారుస్తుందేమో చూడాలి. ఇక ఉపేంద్ర పాత్ర ఇందులో ఎంత లెంగ్త్ ఉంటుందని చూడాలి. అసలు ఉపేంద్ర పాత్రను కేవలం రిఫరెన్సు(Reference)గా వాడుకుంటారా? ఉపేంద్ర పాత్రను చివరి వరకు చూపిస్తూనే ఉంటారా? అన్నది తెలియాల్సి ఉంది. రామ్ బర్త్ డే సందర్భంగా వదిలిన ఈ గ్లింప్స్(Glimpses)రామ్ అభిమానుల్లో ఉత్సాహం, ఊపు నింపేలానే కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.చిత్రంలో సాగర్ పాత్రలో రామ్, మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ(Bhagyashree) నటిస్తుండగా వీరి మధ్య ఓ అందమైన లవ్ స్టోరీ కూడా ఉండబోతోందని అర్ధమవుతోంది. వివేక్ మెర్విన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై రామ్, భాగ్య శ్రీ చాలా హోప్స్ పెట్టుకున్నారు. భాగ్య శ్రీకి మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ ఉండిపోయింది. అందులో గ్లామర్ బాగానే ఒలికించిన లక్ కలిసి రాలేదు.మరి రామ్‌తో చేస్తున్న ఈ మూవీ భాగ్యశ్రీ రాత మారుస్తుందా లేదా చూడాలి. రామ్‌కి కూడా ఈ మూవీ సక్సెస్ అనేది చాలా అవసరం.
Read Also : Actress: సూరితో నటించడం గర్వంగా ఉంది: ఐశ్వర్య లక్ష్మీ