తమన్నా నాయిక ప్రధానమైన పాత్రలను పోషిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే హారర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలలోను గట్టిగానే కనిపిస్తోంది. అలా ఈ మధ్య వచ్చిన ‘అరణ్మనై 4’ సినిమాలోనూ దెయ్యంగా ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి ఆమె ఇప్పుడు దెయ్యాల ఆటకట్టించే మాంత్రికురాలుగా కనిపించింది. తమన్నా మాంత్రికురాలిగా కనిపించన సినిమా ‘ఓదెలా 2’.అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన ‘ఓదెలా రైల్వేస్టేషన్’ 2022లో థియేటర్స్ లోకి వచ్చింది. హెబ్బా పటేల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఆ సినిమా, ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి ఆ సినిమాకి ఇది సీక్వెల్. ఆ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా పలకరిస్తే, ఈ సినిమా హార్రర్ థ్రిల్లర్ గా అలరించనుంది. సంపత్ నంది కథ – స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది.ఏప్రిల్ 17న ఓదెల 2 విడుదలైంది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ఈ మూవీకి మంచి కలెక్షన్లు వస్తున్నాయని ఆదివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంపత్ నంది సుదీర్ఘంగా మాట్లాడాడు.‘ఏడాదిన్నర క్రితం ఈ జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక అద్భుతం జరిగింది, మేం ఏదీ ప్లాన్ చేయలేదు అంతా అలా జరిగిపోయింది, పరమశివుడి వల్లే ఈ ఐడియా వచ్చింది మధు గారి వల్లే ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది.మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి అందరికీ గూస్ బంప్స్ కలిగేలా చేశాడు అజనీష్. సౌందరరాజన్ గారితో నాకు పదేళ్ల అనుబంధం ఉంది. ఆయన లేకపోతే నేను సినిమాల్ని చేయలేదు. ఆయన విజువల్స్ అద్భుతంగా ఇచ్చారు.
సంపత్ నంది
అందరూ షాక్ అయిపోయే బడ్జెట్‌లోనే ఈ సినిమాను తీశాను. ఆర్ట్ డైరెక్టర్ నాయర్ అద్భుతంగా సెట్స్ వేసి ఇచ్చారు. గౌతం రాజు దగ్గర పని చేసిన అవినాష్ ఎడిటింగ్ కూడా అద్బుతంగా ఉంటుంది. ఆయన చాలా కష్టపడ్డాడు. టెక్నీషియన్లంతా కూడా చాలా కష్టపడి పని చేశారు. వారందరికీ థాంక్స్. అందరి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. యాక్టర్ల విషయానికి వస్తే ముందుగా తమన్నాని అనుకున్నాం.తమన్నా 20 ఏళ్ల కెరీర్‌లో ఈ సినిమాకి ముందు ఈ సినిమాకు తరువాత అని అంటున్నారు. ఇంతలా కష్టపడ్డ తమన్నాకి థాంక్స్ తిరుపతి పాత్రలో వశిష్ట తన విశ్వరూపం చూపించాడు. ఆయన ఈ ఇండస్ట్రీలో చాలా కాలం పాతుకుపోతాడు. శ్రీకాంత్ అయ్యంగార్, నాగ మహేష్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. సమాధి శిక్ష అనే సీన్ గగన్ వల్లే అద్భుతంగా ఎలివేట్ అయింది. నేను ఏ కథ చేసినా కూడా ఎక్కడా రిఫరెన్స్ ఉండదు. సమాజం నుంచి గమనించే నేను కథలు, సీన్లు రాస్తాను’ అని అన్నారు.

కొత్త సీక్వెన్సులు
నాకు ఒకప్పుడు భక్తి ఎక్కువగా ఉండేది కాదు కానీ ఈ చిత్రం చేసిన తరువాత భక్తి పెరిగింది. అసలు నేను ఈ కథను రాయలేదు ఆ పరమశివుడే రాయించాడు ఓదెల 2 మీద ఇచ్చిన రివ్యూలు కూడా చూశాను. మున్ముందు ఆ తప్పుల్ని సరి చేసుకుంటాను. ఈ చిత్రంలో ఎన్నో కొత్త సీక్వెన్సులు ఉన్నాయి. దీని గురించి మరింతగా స్ప్రెడ్ చేయండి, సినిమాని సినిమాలో ఉన్న మంచిని మరింత ముందుకు తీసుకెళ్లండి బడ్జెట్ మీరు చెబుతున్నట్టుగా లేదు అసలు ఈ సినిమా రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్ అయింది జనాల ముందుకు వెళ్లకముందే బ్రేక్ ఈవెన్ అయింది’ అని అన్నారు.