
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజును శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. (Salman Khan) ఈ సందర్బంగా, ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ (Battle of Galwan) నుంచి తాజాగా టీజర్‌ను నేడు విడుదల చేశారు.
Read Also: Prakash Raj: అనసూయకు ప్రకాష్ రాజ్ మద్దతు
వాస్తవ ఘటనల ఆధారం
ఈ టీజర్‌లో సల్మాన్ ఖాన్ మునుపెన్నడూ లేని విధంగా ఒక సీరియస్ ఆర్మీ ఆఫీసర్(Army officer) పాత్రలో కనిపించబోతున్నాడు. గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన నటన చాలా బాగుంది..2020లో భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ (Salman Khan), గల్వాన్ పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది (అయితే దీనిపై పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది). టీజర్‌లో ‘చావుకి భయం ఎందుకు.. అది ఎలాగైనా వస్తుంది’ అనే డైలాగు పూనకాలు తెప్పిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: