సౌదీ అరేబియాలో ఘనంగా నిర్వహించిన ‘రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పాల్గొన్నారు. వేదికపై మాట్లాడిన ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “గత పాతికేళ్లుగా నేను బయట ప్రశాంతంగా డిన్నర్ చేయలేదు. ఇల్లు, షూటింగ్ లొకేషన్, ఎయిర్‌పోర్టుల మధ్యే నా జీవితం సాగిపోయింది. మీకు తెలియని విషయం ఏంటంటే, నేను మీరు అనుకున్నంత ఆనందంగా ఉండను” అంటూ సల్మాన్ (Salman Khan) భావోద్వేగానికి లోనయ్యారు.
Read Also: Prabhas: ‘రాజా సాబ్’ నుంచి ‘సహానా సహానా’ సాంగ్ ప్రోమో రిలీజ్

‘నా’ అనే ఫ్రెండ్స్ నలుగురే మిగిలారు
స్టార్‌డమ్ వెనుక దాగి ఉన్న ఒంటరితనం, ఒత్తిడిని ఆయన మాటల్లో స్పష్టంగా వ్యక్తం చేశారు.నా ప్రాణస్నేహితుల్ని పోగొట్టున్నాను. ప్రస్తుతం ‘నా’ అనే ఫ్రెండ్స్ నలుగురే మిగిలారు నాకు.’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు సల్మాన్‌ఖాన్. ఇంకా చెబుతూ ‘నేను బిగ్ స్టార్‌ని మాత్రమే కానీ, గొప్ప నటుడ్నైతే కాదు. తోచినట్టు నటిస్తాను అంతే. ఎమోషనల్ సీన్స్‌లో నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు.’ అంటూ తనపై తానే సెటైర్ వేసుకున్నారు సల్మాన్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: