కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రివాల్వర్ రీటా (Revolver Rita Movie) జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులోను నవంబర్ 28వ తేదీన విడుదలైంది. సుధాన్ సుందరం జగదీశ్ పళనిస్వామి నిర్మించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ తెరపైకి వచ్చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
Read Also: Stampede: ‘పుష్ప 2’ తొక్కిసలాట.. చార్జిషీట్ ఫైల్ చేసిన పోలీసులు?

కథ ఏంటంటే?
పాండిచ్చేరిలోని ఓ ఫ్రైడ్ జాయింట్ షాప్‌లో రీటా (కీర్తి సురేష్) పని చేస్తుంటుంది. తల్లి చెల్లెమ్మ (రాధికా శరత్ కుమార్), ఇద్దరు సిస్టర్స్‌తో ఉంటుంది. ఇదిలా ఉండగా డాన్ డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్) ఓ నేర సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. (Revolver Rita Movie) అతన్ని మర్డర్ చేసి తన సోదరుడి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని నర్సింహారెడ్డి (అజయ్ ఘోష్) ఓ ముఠాతో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇందులో భాగంగా పాండ్యన్‌ను హనీ ట్రాప్ చేసేందుకు ప్రణాళిక రచించగా.. డ్రగ్స్ మత్తులో ఒక ఇంటికి వెళ్లబోయి పొరపాటున పక్క వీధిలో ఉన్న రీటా ఇంటికి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా జరిగిన గొడవలో రీటా తల్లి చెల్లెమ్మ కొట్టిన దెబ్బకు పాండ్యన్ చనిపోతాడు. తండ్రి కనిపించకపోవడంతో కొడుకు బాబీ (సునీల్) అతని కోసం వెతకడం మొదలుపెడతాడు. అసలు పాండ్యన్ చనిపోయిన విషయం అతనికి తెలిసిందా? తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రీటా ఏం చేసింది? మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడింది? అసలు పాండ్యన్ నర్సింహారెడ్డి మధ్య గొడవ ఏంటి? ఒప్పందం చేసుకున్న ముఠా ఏం చేసింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
కథనం
మాఫియా అంతా కూడా అక్రమాలు అరాచకాల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ డబ్బు కోసం ఎవరు ఎవరినైనా మోసం చేస్తూ ఉంటారు. అందువలన నమ్మకం అనే మాట ఇక్కడ వినిపించదు. పగలు ప్రతీకారాల మధ్యనే ఇక్కడ అందరి జీవితాలు తెల్లారుతుంటాయి. అలాంటి మాఫియా మనుషుల బారిన, మగదిక్కులేని ఓ ఫ్యామిలీ పడితే ఎలా ఉంటుందనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. ఈ కథ రీటా బాబీ రెడ్డి దాసు పోలీస్ ఆఫీసర్ కామరాజు అనే ఐదు పాత్రల చుట్టూనే నడుస్తుంది. ప్రధానమైన పాత్రలన్నీ పాండ్యన్ శవంతో ముడిపడి పరిగెడుతూ ఉంటాయి. పాండ్యన్ ను మర్డర్ చేయవలసింది ఒకరు చేసింది ఒకరు చేయించింది ఒకరు గాలించేది ఒకరు. ఇలా ఈ పాత్రలన్నింటి మధ్య నడిచే సన్నివేశాలను కామెడీ టచ్ తో ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ ను అందిస్తూ ఉంటుంది. నిజానికీ ఈ తరహా కథలు ఆడియన్స్ కి అర్థమయ్యేలా స్క్రీన్ ప్లే చేయడం చాలా కష్టమైన విషయం. కానీ సినిమా మొదలైన దగ్గర నుంచి చివరివరకూ కూడా అంతే పట్టుతో అలరిస్తుంది. కథనంలో వేగం క్లారిటీ .. ట్విస్టులు ఇవన్నీ కూడా ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేస్తాయి. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ఈ రెండూ కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: