हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Thammudu Movie Review: తమ్ముడు మూవీ రివ్యూ!

Ramya
Thammudu Movie Review: తమ్ముడు మూవీ రివ్యూ!

Thammudu Movie Review: నితిన్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “తమ్ముడు”. వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు శ్రీరామ్ నుండి వచ్చిన సినిమా కావడంతో, ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రచారం పొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? పూర్తి రివ్యూలో చూద్దాం.

Thammudu Movie Review
Thammudu Movie Review

కథ: జై లక్ష్య సాధన వెనుక అక్కతో బంధం

Thammudu Movie Review: జై (నితిన్) ఒక ఆర్చర్. చిన్నప్పటి నుంచి విలువిద్యలో అత్యంత కష్టపడి శిక్షణ తీసుకుంటాడు. దేశానికి గోల్డ్ మెడల్ (gold medal) సాధించాలనేది అతని కల. అయితే, ప్రతిసారి బుల్స్ ఐ కొట్టడంలో విఫలమవుతూ ఉంటాడు. “మీలో ఏదో సమస్య ఉంది, దాన్ని పరిష్కరించుకున్న తర్వాతే లక్ష్యం గురించి ఆలోచించు” అని కోచ్ చెప్పిన మాటలు విని, తన సమస్యకు పరిష్కారం కోసం బయలుదేరుతాడు జై. అలా అతను చిన్నప్పుడు తన అక్క ఝాన్సీ (లయ)కి చేసిన అన్యాయం గుర్తుకొస్తుంది. దాంతో, అక్క దగ్గరికి బయలుదేరుతాడు. అతను అక్కడికి వెళ్లేసరికి, అక్క కుటుంబం ప్రమాదంలో ఉందని తెలుసుకుంటాడు. ఆమె ఇచ్చిన మాట కోసం (For her word) తన ప్రాణాన్ని కూడా పణంగా పెడతాడు. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.

కథనం: బలహీనమైన స్క్రీన్‌ప్లే

అక్క మాట కోసం తమ్ముడు ఒక ఊరికి వెళ్లి ఏం చేశాడు అనేదే ఈ సినిమా కథ. “మనిషి పోయి మాట బతికితే మనిషి బతికినట్టే.. అదే మాట పోయి మనిషి బతికినా కూడా మనిషి పోయినట్టే” అనేది ఈ సినిమా ప్రధానాంశం. మూడు ముక్కల్లో చెప్పాలంటే, ఒక నిజాయితీపరుడైన ప్రభుత్వ అధికారిని అబద్ధపు సంతకాల కోసం ఒక విలన్ చేసే క్రూరమైన నాటకమే ఈ సినిమా. ఆ నిజాయితీపరుడైన అధికారి తమ్ముడే హీరో. అక్కకు ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఏం చేశాడు అనేది సినిమా కథాంశం. వినడానికి చాలా సింపుల్‌గా అనిపించినా, స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలనుకున్నాడు వేణు శ్రీరామ్, కానీ అది కుదరలేదు. తన గత సినిమాలలో కమర్షియల్ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించిన వేణు, “తమ్ముడు”లో సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాడు. అయితే, నిర్మాత దిల్ రాజు చెప్పినట్లుగా, మొదటి 15 నిమిషాల తర్వాత సినిమా మొత్తం ఒకే రోజులో జరిగే కథ. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా ఉండాలి. కానీ, ఆ విషయంలోనే వేణు శ్రీరామ్ పూర్తిగా తడబడ్డాడు. అక్క అనుకోకుండా ఒక ఊరికి వెళ్లడం, అక్కడ ఆమె కొన్ని సమస్యలలో చిక్కుకోవడం, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, ఆ విషయం తెలిసి తమ్ముడు అక్క మాట కోసం అదే ఊరికి వచ్చి ఆమె ఆశయాన్ని ఎలా తీర్చాడు – ఇవన్నీ ఎన్నో సినిమాలలో చూసిన విషయాలే. ఇందులో “అనుగక్షతి ప్రవాహా” అనే ఒక డైలాగ్ ఉంటుంది, అంటే “గో విత్ ది ఫ్లో” అని అర్థం. దారి ఎటు చూపిస్తే అటు వెళ్ళిపో అని దాని మీనింగ్. కథ, కథనాలు కూడా అలాగే వెళ్ళిపోయాయి, ఎటువంటి మలుపులు, ఉత్కంఠ లేకుండా సాదాసీదాగా సాగిపోయాయి.

నటీనటులు: లయ, నితిన్ ప్రయత్నం

నితిన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్ర ఇచ్చినా తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాడు. అయితే, కథలు వర్కౌట్ కానప్పుడు అతను మాత్రం ఏం చేయగలడు? హీరో తర్వాత అత్యంత కీలకమైన పాత్రను లయ పోషించింది. అక్క పాత్రకు ఆమె ప్రాణం పోసింది. మరో చిన్న పాప క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇక హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ తమ పాత్రలకు న్యాయం చేశారు. లేడీ విలన్‌గా స్వస్తికా విజయ్ బాగుంది. మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్‌దేవ్ బాగా నటించాడు. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం: సంగీతం, సినిమాటోగ్రఫీ హైలైట్స్

ఈ సినిమాకు ప్రధానమైన బలం సంగీతం. అజనీష్ లోక్‌నాథ్ ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. పాటల కంటే ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆకట్టుకున్నాడు అజనీష్. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఎక్కువ భాగం సినిమా అడవిలోనే సాగుతుంది. అక్కడి అందాలను సినిమాటోగ్రాఫర్స్ సమీర్ రెడ్డి, కె.వి. గుహన్, సత్యజిత్ పాండే చాలా బాగా చూపించారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి ఇంకాస్త కఠినంగా ఉండి కొన్ని సన్నివేశాలు తొలగించాల్సి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ కథ మాత్రమే కాదు, స్క్రీన్ ప్లే కూడా పాతదే రాసుకున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Harihara Veeramallu: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870