ప్రముఖ నటి, నిర్మాత రేణు దేశాయ్ (Renu Desai) జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం పట్ల చూపించే శ్రద్ధ ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా ఆమె రేబిస్ టీకా (Rabies Vaccine) తీసుకుంది. తాను టీకా తీసుకుంటున్న ప్రక్రియను వీడియో రికార్డ్ చేసి దానిని సోషల్ మీడియాలో పంచుకుంది. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫోటోలు లేదా వీడియోలు రికార్డ్ చేయని రేణు దేశాయ్.. ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశానని తెలిపింది.
Read Also: Jatadhara Movie: జటాధర ట్రైలర్ విడుదల
నేను రేబిస్ టీకా (Rabies Vaccine)తీసుకుంటున్నప్పుడు రికార్డ్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో తీసుకున్నప్పుడు నేను ఫోటోలు లేదా వీడియోలు తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ సమయానికి టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఈసారి షేర్ చేయాలనిపించింది అని రేణు వెల్లడించింది.
జంతువులను పెంచుకునే వ్యక్తులు, పశువైద్యులు తప్పనిసరిగా తమ టీకా రికార్డులను నిర్వహించుకోవాలని, ఇంజక్షన్లు నిర్ణీత సమయానికి తీసుకుంటున్నారో లేదో నిర్ధారించుకోవాలని రేణు దేశాయ్ (Renu Desai) ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: