టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. ఆయన నటిస్తున్న 77వ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
Read Also: Nithin36: నితిన్ కొత్త సినిమా ప్రకటన
జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతం
సెన్సిటివ్, క్లాస్ కథనాలతో పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈసారి డివోషనల్ టచ్‌తో కథను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. మాస్‌కు భిన్నంగా, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా ద్వారా రవితేజ కొత్త ఇమేజ్‌ను ఆవిష్కరించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రానికి జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక అయ్యప్ప మాలధారణ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, 2026 ఎండింగ్‌లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ‘ఇరుముడి’ రవితేజ (Ravi Teja) కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? అనే ఆసక్తి ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ పెరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: