ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సరదాగా గడిపిన రష్మిక మందన్న
ఎప్పుడూ సోషల్ మీడియాలో(Rashmika Mandanna) చురుగ్గా ఉండే నటి రష్మిక మందన్న, సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) అభిమానులతో ఓ ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఆస్క్ మీ ఎనీథింగ్ అనే భాగంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సరదాగా, నిజాయితీగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్న ఆమె జవాబుతో కలిపి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Read also: మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.1 కోటి నజరానా

500 ఏళ్ల వాలెంటైన్ ప్రపోజల్‌కు చమత్కార సమాధానం
ఓ అభిమాని రష్మికను సరదాగా అడిగాడు రాబోయే 400-500 సంవత్సరాల పాటు నా వాలెంటైన్‌గా ఉంటారా? అని. దీనికి రష్మిక నవ్వుతూ స్పందిస్తూ, ఈ జన్మలోనే మరో 100 ఏళ్ల తర్వాత మనం బతికి ఉంటే తప్పకుండా ఉందాం అని చమత్కారంగా సమాధానమిచ్చింది.ఆ సమాధానం ఆమె అభిమానులను నవ్వుల్లో ముంచేసింది.
ది గర్ల్‌ఫ్రెండ్ షూటింగ్ గురించి రష్మిక వ్యాఖ్యలు
ఈ సెషన్‌లోనే మరో అభిమాని ఆమెను అడిగాడు ది గర్ల్‌ఫ్రెండ్ షూటింగ్ అనుభవం ఎలా ఉంది? అని. దీనికి రష్మిక(Rashmika Mandanna) సీరియస్‌గా స్పందిస్తూ, ఈ సినిమా షూటింగ్ నా జీవితంలో అత్యంత భావోద్వేగంగా గడిచింది. మానసికంగా చాలా అలసిపోయే అనుభవం ఇది. మనం మర్చిపోవాలనుకునే భావోద్వేగాలను మళ్లీ గుర్తు చేసుకోవాల్సి వచ్చింది, అని తెలిపింది. అలాగే ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దగ్గర అడిగితే మరింత బాగా చెబుతారు అని కూడా పేర్కొంది. నవంబర్ 7న విడుదల అయ్యే అవకాశం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: