‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ వివాదం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma) ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.
ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు అయిన వర్మ
ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ వర్మకు నోటీసులు జారీ చేసిన ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, స్టేషన్‌లో విచారణ చేపట్టారు. వర్మ (Ramgopal Varma)తగిన సమయానికి హాజరయ్యారు.
మార్ఫింగ్ కేసుపై విచారణ
గత వైసీపీ (YCP) ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూపొందించిన ‘వ్యూహం’ సినిమా ప్రచారంలో భాగంగా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మరియు నారా లోకేశ్‌ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారన్న ఆరోపణలు రామ్ గోపాల్ వర్మపై వచ్చాయి. దీని ఆధారంగా 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఇది రెండోసారి విచారణ
ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి 7న వర్మ విచారణకు హాజరయ్యారు. అయితే, విచారణ కొనసాగిస్తూ మళ్లీ నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు మరోసారి పోలీసుల ముందు హాజరయ్యారు.ప్రస్తుతం వర్మను ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. విచారణ ముగిసిన తర్వాత కేసు పురోగతిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: