టాలీవుడ్‌లో ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా నటుడు శివాజీ(Shivaji) చేసిన వ్యాఖ్యలు ఇంకా వివాదాన్ని రేపుతూనే ఉన్నాయి. స్టేజ్‌పై ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు తీవ్ర విమర్శలకు దారి తీయగా, ఈ అంశం సినిమా వేదికను దాటి సామాజిక స్థాయిలో చర్చకు దారితీసింది. మహిళల దుస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలను గాయని చిన్మయి, నటి అనసూయ(Anasuya Bharadwaj)తో పాటు పలువురు మహిళా ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఈ విమర్శల నేపథ్యంలో శివాజీ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు.
Read Also: Karate Kalyani: శివాజీ వ్యాఖ్యలపై కరాటే కల్యాణి ఏమన్నారంటే?
శివాజీ మాటలపై రక్షిత్ అట్లూరి అభిప్రాయం
అయితే క్షమాపణలు సరిపోవని, ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ఆలోచనా ధోరణే అసలు సమస్య అని కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలో భిన్న స్వరాలు వినిపించడం మొదలైంది. తాజాగా నటుడు రక్షిత్ అట్లూరి(Rakshit Atluri) ఈ వివాదంపై స్పందిస్తూ శివాజీకి మద్దతుగా మాట్లాడారు.

‘పలాస 1978’ సినిమాతో హీరోగా గుర్తింపు పొందిన రక్షిత్ అట్లూరి, ఈ అంశంపై ఒక వీడియో విడుదల చేసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. శివాజీ కొన్ని పదాలు ఉపయోగించిన తీరు తప్పు కావచ్చని అంగీకరించిన రక్షిత్, అందుకే ఆయన క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేశారు. కానీ శివాజీ చెప్పాలనుకున్న మూల భావనలో మాత్రం తప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
‘తప్పు పదాలే కానీ ఉద్దేశం కాదు’..
శివాజీ మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని రక్షిత్ అన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించినా, ఆధునిక వేషధారణలో ఉన్నా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి సమాజం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని, కుటుంబాలు కూడా తమ పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
మహిళల విలువను గుర్తు చేస్తూ రక్షిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలను తక్కువగా లేదా ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదని, వారు ఎంతో గౌరవానికి అర్హులని పేర్కొన్నారు. పురుషులుగా మహిళలను గౌరవించడం, రక్షించడం మన బాధ్యత అని తెలిపారు. మహిళల భద్రత గురించే శివాజీ చెప్పాలని ప్రయత్నించారని తనకు అనిపిస్తోందని రక్షిత్ అట్లూరి వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: