हिन्दी | Epaper

Rajpal Yadav: జైళ్లలో స్మోకింగ్ జోన్లు ఉండాలి

Saritha
Rajpal Yadav: జైళ్లలో స్మోకింగ్ జోన్లు ఉండాలి

Rajpal Yadav: బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలు నుంచి తాత్కాలిక బెయిల్‌పై విడుదలయ్యారు. రూ.9 కోట్ల కేసులో రూ.1.5 కోట్లు డిపాజిట్ చేసిన అనంతరం ఢిల్లీ హైకోర్టు శిక్షను నిలిపివేసింది. ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశాలతో బయటకు వచ్చిన ఆయన, తన స్వగ్రామమైన షాజహాన్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ఉన్నట్లే జైళ్లలో కూడా ఖైదీల కోసం ప్రత్యేకంగా ‘స్మోకింగ్ జోన్లు’ ఏర్పాటు చేయాలని రాజ్‌పాల్ యాదవ్ కోరారు. “నేను పొగాకు వాడకాన్ని ప్రోత్సహించడం లేదు. సిగరెట్ మానేయడానికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఆ అలవాటు ఉన్నవారికి జైలు లోపల చాలా ఇబ్బందిగా ఉంటోంది” అని ఆయన వివరించారు.

Read Also: Elvish Yadav: పాము విషం కేసు.. యూట్యూబర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Rajpal Yadav: జైళ్లలో స్మోకింగ్ జోన్లు ఉండాలి
Rajpal Yadav: There should be smoking zones in prisons

వారికి రుణపడి ఉంటా

జైళ్లను శిక్షా కేంద్రాలుగా కాకుండా, మనుషులను మార్చే సంస్కరణ కేంద్రాలుగా చూడాలని సూచించారు.ఈ కేసులో తనకు ఎవరి సానుభూతి వద్దని, అప్పు తీర్చడానికి కొంత సమయం మాత్రమే కావాలని ఆయన కోరారు. “నేను భారత్‌లోనే పుట్టాను, నా పాస్‌పోర్ట్ మార్చుకోలేదు. నా దేశ కరెన్సీని మార్చుకోవాలని నాకు లేదు, నా సంపాదనను పెంచుకోవాలనుకుంటున్నాను” అని చమత్కరించారు.

తాను కష్టాల్లో ఉన్నప్పుడు నటులు సోనూసూద్, గుర్మీత్ చౌదరి తన కుటుంబాన్ని ఆదుకున్నారని, వారికి రుణపడి ఉంటానని తెలిపారు.ఫిర్యాదుదారునికి రాజ్‌పాల్ యాదవ్ రూ. 1.5 కోట్లు డిపాజిట్ చేయడంతో, ఢిల్లీ హైకోర్టు మార్చి 18 వరకు ఆయన శిక్షను సస్పెండ్ చేస్తూ విడుదల ఉత్తర్వులు ఇచ్చింది. తన ఇంట్లో వివాహ వేడుక ఉన్నందున, రెండు రోజుల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

📢 For Advertisement Booking: 98481 12870