
ఒడిశాలోని రాయగడ జిల్లాలో ‘రాజాసాబ్’(RajaSaab) సినిమా ప్రదర్శన సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హీరో ప్రభాస్ ఎంట్రీ సీన్ ప్రారంభమైన వెంటనే అభిమానులు అదుపు తప్పిన ఉత్సాహంతో థియేటర్ లోపలే టపాసులు పేల్చారు. ఈ సమయంలో స్క్రీన్ ముందు అమర్చిన అలంకరణ కాగితాలు వెంటనే అంటుకుని మంటలు చెలరేగాయి.
Read also: Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్’ టికెట్ రేట్ల పిటిషన్ వాయిదా
హాల్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
మంటలు వ్యాపించడాన్ని గమనించిన హాల్ యాజమాన్యం, సిబ్బంది తక్షణమే స్పందించారు. ప్రేక్షకుల సహకారంతో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో భారీ ప్రాణ నష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనతో థియేటర్‌లో కొద్దిసేపు భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రేక్షకులు సురక్షితంగా బయటకు వెళ్లడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.
థియేటర్లలో భద్రతపై ప్రశ్నలు
ఈ ఘటనతో సినిమా థియేటర్లలో(RajaSaab) భద్రతా చర్యలపై చర్చ మొదలైంది. థియేటర్ ప్రాంగణాల్లో టపాసులు, అగ్నిప్రమాదాలకు దారితీసే వస్తువులపై కఠిన నిషేధాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: