ఎస్.ఎస్.రాజమౌళి తాజా భారీ ప్రాజెక్ట్ “వారణాసి” విడుదల కాకముందే వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ వంటి టాప్ నటులతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ప్రారంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
Read Also: Puttaparthi: పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సచిన్, ఐశ్వర్యరాయ్
టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌ను రాజమౌళి అద్భుతంగా ప్లాన్ చేసి భారీగా నిర్వహించారు. అయితే ఆ ఈవెంట్‌లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు పెద్ద సమస్యగా మారాయి. “వారణాసి” టైటిల్ (Varanasi Title) వివాదం. రాజమౌళి టైటిల్ రివీల్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.
కానీ ఈ టైటిల్ మరో నిర్మాణ సంస్థ అయిన రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ వద్ద ఇప్పటికే రిజిస్టర్ అయి ఉందని తెలిసింది. నిర్మాత సి.హెచ్. సుబ్బారెడ్డి ఈ టైటిల్‌ను 2023లో రిజిస్టర్ చేసుకున్నారు, 2026 వరకూ రీన్యూ కూడా చేశారు.రాజమౌళి టీమ్ “Varanasi” అనే స్పెల్లింగ్‌తో టైటల్ ప్రకటించగా, సుబ్బారెడ్డి “Vaaranasi” అనే స్పెల్లింగ్‌తో రిజిస్టర్ చేశారు.

టైటిల్ హక్కులపై గందరగోళం నెలకొంది
అయితే ఉచ్చారణ ఒకటే కావడంతో టైటిల్ (Varanasi Title) హక్కులపై గందరగోళం నెలకొంది. దీనిపై ఫిల్మ్ ఛాంబర్‌కి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసినా, అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు.రెండు పక్షాలు టైటిల్‌పై తమ హక్కులు ఉన్నాయని చెబుతున్నందున
ఇది ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. రాజమౌళి, నిర్మాత కార్తికేయ సుబ్బారెడ్డితో చర్చ జరిపే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. లేకపోతే ఈ విషయం లీగల్‌గా వెళ్లే అవకాశమూ ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: